Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

These 5 rules related to your money will change from 1st August

ఆగ‌ష్టు 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చే "న్యూ రూల్స్"..
ఆగ‌ష్టు 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. కార్లు, బైకుల ధ‌ర‌ల భారం క‌స్టమ‌ర్ల‌పై త‌గ్గ‌బోతుంది. ఆగ‌ష్టు 1వ నుంచి రైతుల ఖాతాల్లోకి ప్ర‌ధాని మంత్రి కిసాన్ యోజ‌న ప‌థ‌కం డబ్బులు కూడా జ‌మ కాబోతున్నాయి. IRDAI, Minimum Balance, PM-Kisan, RBI & E-Commerce వంటి వాటిలో వచ్చే మార్పుల గురించి తెలుసుకుందాం..
IRDAI: కొత్త బైక్ లేదా కార్ కొనేవారికి IRDAI ఆగ‌ష్ట్ 1 నుంచి కార్లు, బైకులు కొనేవారికి కొత్త రూల్స్ వ‌ర్తించ‌బోతున్నాయి. ఇంత‌కుముందు వ‌ర‌కూ లాంగ్ ట‌ర్మ్ వెహిక‌ల్ ఇన్యూరెన్స్ ప్యాకేజీ పాల‌సీలు తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రిగా ఉండేది. ఇప్పుడు దానిని 1సం. పరిమితం చేశారు.
RBI: ఆగ‌ష్టు 1వ తేదీ నుంచి ఆర్బీఐ సేవింగ్స్ అకౌండ్ల‌పై వ‌డ్డీ రేట్లు మార‌బోతున్నాయి. ల‌క్ష రూపాయ‌ల‌లోపు ఉంటే 4.75 శాతం, ల‌క్ష నుంచి 10 ల‌క్ష‌ల మ‌ధ్య ఉంటే 6 శాతం, 10 ల‌క్ష‌ల నుంచి 5 కోట్ల ఉంటే 6.75 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. అలాగే డెబిట్ కార్డ్ పోగొట్టుకున్నా, డ్యామెజ్ అయిన కొత్త కార్డుకు అప్లై చేసుకుంటే రూ.250 చెల్లించాలి.
Minimum Balance: ఆగ‌ష్టు 1 నుంచి మినిమ్ బ్యాలెన్స్ రూల్స్ మార‌నున్నాయి. యాక్సిస్ బ్యాంక్, కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్‌, ఆర్‌బీఎల్ బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర మూడు ఫ్రీ ట్రాన్సాక్ష‌న్స్ త‌ర్వాత క‌స్ట‌మ‌ర్ల నుంచి ఛార్జీలు వ‌సూలు చేయ‌నున్నాయి.
PM-Kisan: ప్ర‌ధాని మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థకం డబ్బుల్ని కేంద్ర ప్ర‌భుత్వం ఆగ‌ష్టు 1 నుంచి రైతుల ఖాతాల్లో జ‌మ చేయ‌నుంది. రెండు వేల రూపాయ‌ల చొప్పున ఆరో ఇన్‌స్టాల్‌మెంట్‌ను రైతుల ఖాతాల్లోకి బ‌దిలీ చేయనుంది.
E-Commerce: ఆగ‌ష్టు 1 నుంచి ఇ-కామ‌ర్స్ కంపెనీలు ఉత్ప‌త్తుల‌పై ఏ దేశానికి చెందిన ప్రోడెక్ట్ అన్న విష‌యాన్ని వివ‌రించాల్సి ఉంటుంది. అంటే వినియోగ‌దారులు కొనే ప్రోడ‌క్ట్స్‌పై మేడ్ ఇన్ ఇండియాలో త‌యారు చేసిన వ‌స్తువులా? లేదా ఇత‌ర దేశాల్లో త‌యారైన ప్రోడ‌క్ట్సా అని గుర్తించేందుకు వీలుగా ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags