======================
భారత క్రీడాకారులకు పరిచయం అక్కర్లేని పేరు ధ్యాన్ చంద్. భారతదేశంలో క్రీడా దినోత్సవ సృష్టికర్త హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్.
భారత హాకీ ఇంద్రజాల నైపుణ్యాన్ని ప్రపంచమంతట చాటి చెప్పి దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్ళిన ఘనత మేజర్ ధ్యాన్‌చంద్‌దే. ఆయన జన్మదినమైన ఆగస్టు 29ని జాతీయ క్రీడాదినోత్సవం జరుపుకోవడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. అయితే జాతీయ క్రీడాదినోత్సవం గురించి చాలా మందికి తెలియదు.
1928 ఆమ్‌స్టర్‌డామ్,
1932 లాస్ ఏంజిలెస్, 1936 బెర్లిన్ ఒలింపిక్
గేమ్స్ లో భారత్‌కు బంగారు పతకాలు అందించిన ఘనత ధ్యాన్‌చంద్‌కే దక్కింది. ధ్యాన్‌చంద్
నేతృత్వంలో భారత పురుషుల హాకీ జట్టు మూడు సార్లు ఒలింపిక్స్ పతకాలను గెలిచింది. 1936లో లాస్‌ఎంజిల్స్ లో జరిగిన పోటీలో అమెరికాపై ధ్యాన్‌చంద్ 9 గోల్స్‌చేసి భారత్‌ను గెలిపించారు. ధ్యాన్‌చంద్ తన చివరి అంతర్జాతీయ
మ్యాచ్‌ను 1948లో ఆడాడు. తన అంతర్జాతీయ హాకీ కేరీర్‌లో 400కు పైగా గో ల్స్‌ను నమోదు చేసాడు. ధ్యాన్‌చంద్ ఆటకు ముగ్ధుడైన జర్మనీ
నియంతన హిట్లర్ ధ్యాన్‌చంద్‌కు జర్మనీలో కల్నల్‌హోదా ఇస్తామని విజ్ఞప్తి చేయగా
ధ్యాన్‌చంద్ తన మాతృదేశాన్ని వీడనని చెప్పటం క్రీడాస్ఫూర్తికి నిదర్శనం.
హాకీలో భారత్‌కు చారిత్రాత్మక
విజయాలు అందించడంతో పాటు ధ్యాన్‌చంద్ ఎన్నో అరుదైన ఘనతలు సొంతం చేసుకున్నారు.
భారత్ పేరు ప్రపంచపటంలో మారుమ్రోగి పోవడంలో ధ్యాన్ చంద్ కీలకపాత్ర పోషించాడు.
క్రీడా రంగంలో ధ్యాన్‌చంద్ చేసిన కృషికి ప్రభుత్వం 1956 లో భారతీయ మూడవ
అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ భూషణ్‌తో సత్కరించింది. క్రీడా రంగంలో ఎంతో మందికి
స్ఫూర్తిదాతగా నిలిచిన ధ్యాన్‌చంద్ పుట్టినరోజును జాతీయ క్రీడా దినోత్సవంగా
కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ క్రీడా దినోత్సవ ప్రధాన లక్ష్యం క్రీడల
ప్రాముఖ్యత గురించి యువతలో అవగాహన కల్పించడం, ఆటల వల్ల
శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి తెలియజేయడం.
======================
భారత దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ‘ఖేల్ రత్న’ పేరు మార్పు
======================
0 Komentar