What is the future of D.Ed Colleges?
ఎస్ఈపీలో రద్దుకు ప్రతిపాదన
మూతపడనున్న కళాశాలలు
ఉపాధ్యాయ విద్యలో సంస్కరణలు
ఉపాధ్యాయ విద్యలో కొత్త సంస్కరణల దిశగా అడుగులు
పడుతున్నాయి. ఇంటర్మీడియట్ అర్హతతో బోధనవైపు అవకాశం కల్పించే డిప్లొమా ఇన్
ఎడ్యుకేషన్ ఇకపై కనుమరుగు కానున్నది. కేంద్ర విద్యాశాఖ ఇటీవల తీసుకొచ్చిన నూతన
జాతీయ విద్యావిధానంలో ఈ మేరకు ప్రతిపాదనలు చేశారు. అలాగే ప్రస్తుతం ఉన్న బీఈడీలో మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని
నిర్ణయించారు. రాష్ట్రంలో 2008 నుంచి ప్రైవేట్ డీఎడ్ కళాశాలలు కొనసాగుతున్నాయి.
ఇంటర్మీడియట్ విద్యార్హత ఉన్నవారు
డైట్ సెట్ రాసి, మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు
పొందాల్సి ఉంటుంది. అలాగే నిబంధనల
ప్రకారం కళాశాలలకు మంజూరైన సీట్లలో కన్వీనర్ కోటాను ప్రభుత్వం కేటాయిస్తూ
వస్తోంది.
దాదాపు 750 ప్రైవేట్ కళాశాలలు..
రాష్ట్రంలో దాదాపు 750 వరకు
ప్రైవేట్ డీఎడ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 70 వేలకు పైగా సీట్లు ఉన్నాయి. ఈ
కళాశాలల్లో పది వేలమందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ డీఈడీ కళాశాలలు
22 ఉన్నాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన జాతీయ
విద్యావిధానంతో ఈ కళాశాలలన్నీ మూతబడనున్నాయి. ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో నాలుగేళ్ల
బీఈడీ కోర్సు చేసిన వారినే ఉపాధ్యాయులుగా నియమించాలని NEP ప్రతిపాదించారు.
ప్రస్తుతం ఉన్న రెండేళ్ల బీఈడీని యథావిధిగా
కొనసాగించడంతోపాటు.. ఇంటర్
అర్హతతో ఉండే డీఎడ్ ను రద్దు
చేసి.. నాలుగేళ్ల వ్యవధి ఉండే ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ)
కోర్సును ప్రవేశపెట్టాలని కేంద్ర విద్యాశాఖ ప్రతిపాదించింది. ఈ బీఈడీ తర్వాత చేసే మాస్టర్
ఆఫ్ ఎడ్యుకేషన్(ఎంఈడీ) కోర్సు వ్యవధిని రెండేళ్ల నుంచి ఏడాదికి కుదించాలని సూచించింది.
0 Komentar