Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

1000 New Jobs in CMS (CASH MANAGEMENT SERVICES) - Rs 30,000 salary per month



1000 New Jobs in CMS - Rs 30,000 salary per month 


CMS ‌లో కొత్తగా 1000 ఉద్యోగాలు.. నెలకు రూ.30 వేల జీతం..!
సీఎంఎస్‌ సంస్థ వచ్చే రెండు నెలల్లో కొత్తగా వెయ్యి మందిని నియమించుకోనుంది.

సీఎంఎస్ (CASH MANAGEMENT SERVICES).. ఏటీఎంలలో క్యాష్‌‌ను నింపడం వంటి క్యాష్‌‌ మేనేజ్‌‌మెంట్‌ సర్వీసెస్‌‌లను అందిస్తోంది. ఈ సంస్థ వచ్చే రెండు నెలల్లో కొత్తగా వెయ్యి మందిని నియమించుకోనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మరింత మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. వీరి శాలరీ నెలకు రూ. 30 వేల పైనే ఉంటుందని సీఎంఎస్‌‌ తెలిపింది.

తమతో కలిసి పనిచేస్తున్న బ్యాంకులు, ఎన్‌‌బీఎఫ్‌‌సీలు, మైక్రో ఫైనాన్స్‌‌ల కోసం డబ్బులను కలెక్ట్‌‌ చేసే బిజినెస్‌‌లోకి కూడా రానుంది. కస్టమర్ల నుంచి డబ్బులు, చెక్‌‌లను కలెక్ట్‌‌ చేసేందుకు ఇప్పటికే మహింద్రా ఫైనాన్స్‌‌, ఎల్‌‌ అండ్‌‌ టీ వంటి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇది నిజంగా నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.

సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అనుష్‌ రాఘవన్‌ మాట్లాడుతూ.. సీఎంఎస్‌ దేశవ్యాప్తంగా 1,15,000 ఏటీఎంలు, అవుట్‌లెట్స్‌కు క్యాష్‌‌ మేనేజ్‌‌మెంట్‌ సర్వీసెస్‌‌లను అందిస్తోందని తెలిపారు. ఇకపై ఎడ్యుకేషన్‌, ట్రావెల్‌ తదితర రంగాల్లో కస్టమర్ల నుంచి డబ్బులు, చెక్‌‌లను కలెక్ట్‌‌ చేసే బిజినెస్‌లోకి రానుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రానున్న రెండు నెలల్లో కొత్తగా 1000 మందిని నియమించుకోనున్నట్లు వెల్లడించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags