12 Months Salary For Contract Lecturers From This Academic Year
ఈ విద్యా సంవత్సరం నుండి ఒప్పంద అధ్యాపకులకు 12 నెలల వేతనం
రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో పని
చేస్తున్న ఒప్పంద అధ్యాపకుల వినతి మేరకు 12 నెలల పాటు వేతనం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం జగన్ ఇందుకు
ఆమోదం తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ జూనియర్, వృత్తి
విద్య, పాలిటెక్నిక్, డిగ్రీ, ప్రైవేటు, ఓరియంటల్ కళాశాలల్లో బోధించేవారికి ఇది
వర్తిస్తుంది. ఇప్పటివరకు కాంట్రాక్ట్ టీచర్లు ఏడాదికి 10 నెలల జీతం మాత్రమే
అందుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కాలేజీల్లో 5,042
మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పని చేస్తున్నారు. ఇక నుంచి వీరందరిని సంవత్సరం జీతం
చెల్లించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
0 Komentar