145 Engineer Jobs in BEL
BEL లో 145 ఇంజనీర్ ఉద్యోగాలు
ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
జీతం రూ.35 వేలు..!
బెల్ ఇంజనీర్ ఉద్యోగాలు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు
చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) బెంగళూరు, హైదరాబాద్,
చాందీపూర్, వైజాగ్, మచిలీపట్నంతో
సహా దేశంలో అనేక యూనిట్లలో ఖాళీగా ఉన్న 145 ప్రాజెక్ట్
ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులు కంప్యూటర్ సైన్స్,
ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్
కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్
విభాగాల్లో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
పూర్తి వివరాలకు అభ్యర్థులు https://bel-india.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 145
ప్రాజెక్ట్ ఇంజినీర్ - 54
ప్రాజెక్ట్ ఇంజనీర్ (1) - 37 (Civil/
EEE/ Mechanical)
ట్రెయినీ ఇంజనీర్ - 54
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో
బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట అనుభవం ఉండాలి.
ఉద్యోగ విభాగాలు: కంప్యూటర్
సైన్స్,
ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్
కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్,
సివిల్, మెకానికల్ తదితర విభాగాల్లో ఖాళీలు
ఉన్నాయి.
పని ప్రదేశం: బెంగళూరు, హైదరాబాద్/చాందీపూర్
(ఒడిశా), వైజాగ్, మచిలీపట్నంతో పాటు
దేశంలో అనేక ప్రాంతాలు.
వయసు: 01.09.2020 నాటికి ట్రెయినీ ఇంజనీర్ పోస్టులకు 25 ఏళ్లు,
ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం,
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ట్రెయినీ ఇంజనీర్
పోస్టులకు రూ.200, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు రూ.500.
దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 7, 2020
దరఖాస్తుకు చివరి తేది:
సెప్టెంబర్ 27, 2020
వెబ్‌సైట్: https://bel-india.in/
Download
Notification 1 : 108 Jobs
Download
Notification 2 : 31 Jobs
0 Komentar