52 thousand vacancies for teacher posts in Telugu states
Union ministers revealed in the Lok Sabha
తెలుగు రాష్ట్రాల్లో 52
వేల ఉపాధ్యాయ పోస్టుల ఖాళీ
లోకసభలో వెల్లడించిన కేంద్ర
మంత్రులు
రెండు తెలుగు రాష్ట్రాల్లోని
ప్రభుత్వ పాఠశాలల్లో 52,788 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు,
జీఎస్టీ ఎగవేతలు కూడా ఆయా రాష్ట్రాల్లో ఎక్కువగానే ఉన్నట్టు కేంద్ర
మంత్రులు వెల్లడించారు. శనివారం లోకసభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు.
దేశంలోని 36 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పాఠశాలలకు
61,84,167 ఉపాధ్యాయ పోస్టులు మంజూరుచే యగా, ప్రస్తుతం 10,60,139 (17.14%) ఖాళీగా ఉన్నాయి.
తెలంగాణలో 1,40,902 పోస్టులకుగానూ 17,900(12.70%), ఆంధ్రప్రదేశ్ లో 2,46,552 పోస్టులకుగానూ 34,888
(14.15%) భర్తీకి నోచుకోలేదు. ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ అనేది నిరంతర
ప్రక్రియ. పదవీ విరమణ, విద్యార్థుల సంఖ్య పెరిగేకొద్దీ అదనపు
నియామకాలు అవసరం అవుతాయి. ఖాళీలూ పెరుగుతూ పోతాయి' అని
విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ విశ్లేషించారు. విద్య ఉమ్మడి జాబితాలోకి
వస్తుందని, నియామకాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాల్సి
ఉంటుందన్నారు.
Telangana lo how many vacancy post vunny SGT
ReplyDelete