Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

72 Jobs in KMC-Warangal



72 Jobs in KMC-Warangal
KMC- వరంగల్‌లో 72 ఉద్యోగాలు
వ‌రంగ‌ల్‌లోని కాక‌తీయ మెడిక‌ల్ కాలేజ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 72 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన వ‌రంగ‌ల్‌లోని కాక‌తీయ మెడిక‌ల్ కాలేజ్ ‌(కేఎంసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 72 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులు ఈఎన్‌టీ, ఆప్త‌ల్మాల‌జీ, జ‌న‌ర‌ల్ మెడిసిన్‌, గైన‌కాల‌జీ, పీడియాట్రిక్స్‌, సైకియాట్రీ, రేడియాల‌జీ, అనెస్తీషియాల‌జీ, రేడియోథెరపీ తదితర విభాగాలకు చెందినవి. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్‌ 21, 2020 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలకు

https://kmcwgl.com/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

ముఖ్య సమాచారం:
పోస్టు పేరు: సీనియ‌ర్ రెసిడెంట్‌
మొత్తం ఖాళీలు: 72
విభాగాలు: ఈఎన్‌టీ, ఆప్త‌ల్మాల‌జీ, జ‌న‌ర‌ల్ మెడిసిన్‌, గైన‌కాల‌జీ, పీడియాట్రిక్స్‌, సైకియాట్రీ, రేడియాల‌జీ, అనెస్తీషియాల‌జీ, రేడియోథెరపీ తదితరాలు.
అర్హ‌త‌: ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌) ఉత్తీర్ణ‌త‌ ఉండాలి.
ఎంపిక విధానం: పీజీ థియరీ ఎగ్జామ్‌లో వ‌చ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: సెప్టెంబర్‌ 21, 2020
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: ప్రిన్సిప‌ల్‌, కాక‌తీయ మెడిక‌ల్ కాలేజ్‌, వ‌రంగ‌ల్‌.
వెబ్‌సైట్‌: https://kmcwgl.com/

Previous
Next Post »
0 Komentar

Google Tags