Abolition of VRO system in Telangana
తెలంగాణ లో విఆర్వో వ్యవస్థ రద్దు
తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ
వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇందులో భాగంగా
వీఆర్వోలు వ్యవస్థను రద్దు చేసింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిని
తగ్గించడానికి చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో మొత్తం రిజిస్ట్రేషన్ల ప్రక్రియను
నిరవధికంగా నిలిపివేసింది. ఈ మేరకు కొత్త రెవెన్యూ చట్టం సహా పలు కీలక బిల్లులకు
సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రి మండలి సమావేశం ఆమోదం
తెలిపింది. మంగళవారం నుంచి ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిపి వేస్తున్నట్లు రాష్ట్ర
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులిచ్చారు. పౌరులకు నాణ్యమైన
సేవలు అందించడమే లక్ష్యంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో సాంకేతిక మార్పులు
తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు అన్ని రిజిస్ట్రార్, సబ్
రిజిస్ట్రార్ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. వివాహ
రిజిస్ట్రేషన్లు మాత్రం ఆన్లైన్లో కొనసాగుతాయని ప్రకటించారు. మరో పక్క రాష్ట్రంలో
భూములకు పూర్తి స్పష్టత తీసుకువచ్చేందుకు ప్రభుత్వం త్వరలో సమగ్ర భూ సర్వేకు కూడా
శ్రీకారం చుట్టనుంది. మొత్తం 10828 రెవెన్యూ గ్రామాల్లోని భూముల సర్వే బాధ్యతను
ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని భావిస్తోంది.
సంస్కరణలో కీలక అంశాలివి.
- రాష్ట్రంలో ఇక మీదట వ్యవసాయ
భూముల రిజిస్ట్రేషన్లు పూర్తిగా తహసీల్దార్ కార్యాలయాల్లోనే జరుగుతాయి.
- వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్, వివాహాల
రిజిస్ట్రేషన్ సహా ప్రస్తుతం నిర్వహిస్తున్న ఇతర విధులు మాత్రం స్టాంపులు
రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలో ఉంటాయని సమాచారం విక్రయదారు, కొనుగోలుదారు
రిజిస్ట్రేషన్ సమయంలో మాత్రమే కార్యాలయానికి రావాల్సి
ఉంటుంది.
-రిజిస్టర్ డాక్యుమెంట్, పాస్
పుస్తకం కొనుగోలుదారుకుపోస్టు ద్వారా అందుతాయి.
- రికార్డుల్లో పేరు మార్పు (మ్యుటేషన్)
ప్రక్రియ ఆటోమెటిక్ గా పూర్తవుతుంది.
వీఆర్వోల నుంచి దస్త్రాలు స్వాధీనం
గ్రామ రెవెన్యూ వ్యవస్థ రద్దుడు
నిర్ణయించిన నేప ధ్యంలో రాష్ట్రంలోని వీఆర్వోల వద్ద ఉన్న దస్త్రాలను 12 గంటల
వ్యవధిలోనే ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. సోమవారం ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తూ వెంటనే ఆ దస్త్రాలన్నీ
స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఆ మేరకు కలెక్టర్లు తహసీల్దార్లకు అంతర్గత
ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలోని 10,823 రెవెన్యూ గ్రామాలకు చెందిన భూ
దస్త్రాలు, వాటి నకళ్లను తహసీల్దారు. వీటి ర్వోల నుంచి వెనక్కు
తీసుకున్నారు.
0 Komentar