AGRICET, AGRIENGGCET - 2020
Notification
PJTSAU: అగ్రిసెట్, అగ్రి ఇంజినీరింగ్ సెట్-2020 నోటిఫికేషన్ విడుదల
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ
రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 2020-21 సంవత్సరానికిగాను
బీఎస్సీ (హానర్స్), బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్)
ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆన్‌లైన్ కంప్యూటర్
బేస్డ్ టెస్ట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 4, 2020 దరఖాస్తుకు
చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.pjtsau.edu.in/ చూడొచ్చు.
కోర్సులు: బీఎస్సీ (హానర్స్), బీటెక్
(అగ్రికల్చరల్ ఇంజినీరింగ్)
సీట్లు: బీఎస్సీ (హానర్స్)-65, బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్)- 7.
అర్హత: డిప్లొమా(అగ్రికల్చర్, సీడ్
టెక్నాలజీ, ఆర్గానిక్ అగ్రికల్చర్), డిప్లొమా (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత ఉండాలి. 2019-20 విద్యాసంవత్సరం వారు అర్హులే.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ కంప్యూటర్
బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష తేది: అక్టోబర్ 13, 2020.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, ఖమ్మం,
వరంగల్, కరీంనగర్, నిజామాబాద్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీలకు
రూ.1200, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.600.
దరఖాస్తుకు చివరి తేది:
అక్టోబర్ 04, 2020.
వెబ్‌సైట్: https://www.pjtsau.edu.in/
నోటిఫికేషన్: DOWNLOAD
0 Komentar