All colleges must achieve NAAC
recognition within three years
అన్ని కళాశాలలకు మూడేళ్లలో న్యాక్
గుర్తింపు సాధించాలి
రాష్ట్రంలోని అన్ని కళాశాలలు వచ్చే మూడేళ్లలో
న్యాక్ గుర్తింపు సాధించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ప్రమాణాలు లేని
ఇంజినీరింగ్ కళాశాలలతో సహా అన్నింటికి నోటీసులు జారీ చేయాలని, మార్పు
రాకపోతే చర్యలు తప్పవని యాజమాన్యాలకు చెప్పాలన్నారు. ప్రమాణాలు పాటించని ఇంటర్
కళాశాలల పైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉన్నత విద్యలో నూతన విద్యా విధానం
అమలుపై క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎం సమీక్షించారు. 'జాతీయ
అక్రిడిటేషన్ సంస్థలకు అనుబంధంగా రాష్ట్రంలోనూ విభాగం ఏర్పాటు చేయాలి. విజయనగరంలో
ఇంజినీరింగ్ విద్య ప్రాధాన్యంగా బహుళ కోర్సుల విశ్వవిద్యాలయం, ఉపాధ్యాయ విద్య ప్రాధాన్యంగా ఒంగోలులో వర్సిటీ ఏర్పాటు చేయాలి. కళాశాలల
తనిఖీలకు ముగ్గురు సభ్యుల చొప్పున 10 బృందాలను ఏర్పాటు చేయాలి.
ప్రమాణాలు, నాణ్యత లేని విద్యా సంస్థలకు మార్చుకొనేందుకు
కొంత సమయం ఇవ్వాలి. ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్లో నాణ్యత లేకపోతే నిర్దాక్షిణ్యంగా
వ్యవహరించాలి. బీఈడీ - కళాశాలలు కచ్చితంగా ప్రమాణాలు పాటించాలని సూచించారు.
కోర్సుల్లో మార్పులు
'రాష్ట్రంలో ఏడాది. రెండేళ్ల పీజీ,
మూడు, నాలుగేళ్ల యూజీ కోర్సులను ఈ ఏడాది నుంచే
ప్రారంభించాలి. నాలుగేళ్ల డిగ్రీ పూర్తిచేసిన వారికి నేరుగా పీహెచ్ డీలో ప్రవేశం
కల్పించాలి. వచ్చే ఏడాది నుంచి ఐదేళ్ల సమీకృత పీజీ, నాలుగేళ్ల
సమీకృత బీఈడీ కోర్సులు ప్రవేశ పెట్టాలి . భవిష్యత్తులో ఉపయోగపడేలా ఉన్నత విద్యలో
అడ్వాడ్ కోర్సులను తీసుకురావాలి. రోబోటిక్స్, కృత్రిమ
మేధస్సు, డేటా అనలటిక్స్, బీకాంలో
సెక్యూరిటీ అనాలిసిస్, రిస్క్ మేనేజ్ మెంట్ వంటి కొత్త
కోర్సులను ప్రవేశపెట్టాలి' అని చెప్పారు. రాష్ట్రంలో స్వయం
ప్రతిపత్తి కళాశాలలు పెరగాల్సి ఉందన్నారు. 200 పైగా
కళాశాలలకు ప్రమాణాలపై నోటీసులు ఇచ్చామని అధికారులు వెల్లడించారు.
0 Komentar