ANU Degree, PG exams from today
నేటి నుంచి ఏఎన్‌యూ పరిధిలో డిగ్రీ, పిజి పరీక్షలు
ఆచార్య
నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో సోమవారం నుంచి డిగ్రీ, పీజీ,
వృత్తి విద్యా కోర్సుల పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కోవిడ్-19 కారణంగా ఈ ఏడాది మార్చిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. గత ఆరు
నెలలుగా పరీక్షలు నిర్వహిం చేందుకు ఏఎన్‌యూ అధికారులు పలుమార్లు షెడ్యూల్
ప్రకటించినప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా వాయిదా వేయాల్సి వచ్చింది.
తాజాగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాపరమైన కార్యకలాపాలు, విద్యార్థులకు
పరీక్షలు నిర్వహించాలని యూజీసీ, రాష్ట్ర ప్రభుత్వం
సూచించడంతో ఏఎన్‌యూ పరీక్షల నిర్వహణకు సిద్ధమైంది. కోవిడ్-19 లాక్ డౌన్లో రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, వృత్తి
విద్యా కోర్సుల పరీక్షలు నిర్వహిస్తున్న తొలి విశ్వవిద్యాలయంగా ఏఎన్‌యూ నిలిచింది.
ఏర్పా ట్లు ఇలా..
కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా యూనివర్సిటీ పరిధిలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి పరీక్ష కేంద్రంలో
విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించనున్నారు. ప్రతి విద్యార్థికీ థర్మల్ స్క్రీనింగ్ తదితర
పరీక్షలు చేశాకే పరీక్ష కేంద్రంలోకి పంపుతారు. పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బంది, హాజరయ్యే
విద్యార్థులంతా తప్పక మాస్కులు ధరించేలా చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాల్లో
శానిటైజర్లు అందుబాటులో ఉంచుతారు.
0 Komentar