ANU secured a Grand Master title in Asia
Book of Records
ఏఎన్‌యూకి ఆసియా బుక్ ఆఫ్
రికార్డ్స్ లో స్థానం
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ANU) ప్రభుత్వ విశ్వవిద్యాలయం నుండి గరిష్ట ర్యాంకులు మరియు ధృవపత్రాలను
అందుకున్నందుకు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గ్రాండ్ మాస్టర్ టైటిల్‌ను
దక్కించుకుంది. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వరల్డ్ రికార్డ్ విశ్వవిద్యాలయానికి
అనుబంధంగా ఉంది మరియు ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ ఆఫ్ రికార్డ్స్‌ను అనుసరిస్తుంది.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి
ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించిందని ఏఎన్‌యూ వీసీ ఆచార్య పి.రాజశేఖర్, యూనివర్సిటీ
ఆన్లైన్ ర్యాంకింగ్స్ కో-ఆర్డినేటర్ డాక్టర్ భవనం నాగ కిషోర్ తెలిపారు. గ్రాండ్
మాస్టర్ టైటిల్ తో ఏఎన్‌యూకి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థానం కల్పించిందన్నారు.
ఏడాది కాలంలో జాతీయ, అంతర్జా తీయ స్థాయిలో 24 ర్యాంకులను ఏఎన్‌యూ సాధించిందని, దీనిని పరిగ
ణనలోకి తీసుకున్న ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఏఎన్‌యూకి ఈ ప్రత్యే కత స్థానం
కల్పించిందని తెలిపారు. ఈ స్థానం సంపాదించిన ప్రభుత్వ యూనివర్సిటీల కేటగిరీలో
ఆసియా ఖండంలోనే ఏఎన్‌యూ మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఇందుకు రెక్టార్
ఆచార్య పి.వరప్రసాద మూర్తి, రిజిస్ట్రార్ ఆచార్య కె రోశయ్య
హర్షం వ్యక్తం చేశారు.
0 Komentar