AP: Government key decision regarding
VHA posts in village secretariats
గ్రామ సచివాలయాల్లో
వీహెచ్‌ఏ పోస్టుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం
1783 విలేజ్ హార్టికల్చర్
అసిస్టెంట్ (వీహెచ్‌ఏ) పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం
తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 1,783 విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ (వీహెచ్‌ఏ) పోస్టుల భర్తీలో బీటెక్(ఉద్యాన)
విద్యార్హతను ప్రభుత్వం తొలగించింది. ఉద్యానశాఖ సబార్డినేట్ నిబంధనలు, వ్యవసాయ, సహకారశాఖలకు సంబంధించిన విద్యార్హతలు
పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ఉద్యాన సంచాలకులు చిరంజీవి చౌదరి తెలిపారు.
అర్హత ఉన్న వారికే హాల్‌టికెట్లు:
కొంతమంది హాల్ టికెట్స్ రాలేదని
ఆందోళన చెందుతున్నట్లు తెలిసిందని ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.
నిర్దేశించిన అర్హతలు ఉన్నవారికి మాత్రమే హాల్ టికెట్స్ వస్తాయని తెలిపారు. ఉద్యాన, పశు
సంవర్థక సహాయకుల పోస్టుల కంటే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్యే తక్కువగా ఉంది.
అలాగని ఉద్యోగ ప్రకటనలో పేర్కొన్న అర్హతలను తగ్గిస్తే ప్రభుత్వ ఉద్దేశం
దెబ్బతింటుంది. ఈ రెండు పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో నిర్దేశిత
అర్హతలున్న వారికే హాల్‌టికెట్లు వస్తాయని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
0 Komentar