AP: Notification for Nursing Courses
Released
నర్సింగ్ కోర్సులకు
నోటిఫికేషన్ విడుదల
జీఎన్‌ఎం, పోస్టు
బేసిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ వైద్య విద్యా డెరైక్టరేట్ నోటిఫికేషన్
విడుదల చేసింది.
కరోనా కాలంలో ఫ్రంట్‌లైన్
వారియర్స్‌గా మెప్పు పొందిన వృత్తి. సమాజంలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపుస్తుంది.
రోగులకు,
డాక్టర్లకు మధ్య వారధిగా సేవలు అందించే ఈ నర్సింగ్ కోర్సులకు
కెరీర్ అవకాశాలకు కొదవలేదు. చదువు పూర్తికాగానే కొలువు దక్కడం ఖాయం..! అయితే..
ప్రస్తుతం ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్లలో 2020-21 విద్యాసంవత్సరానికి జీఎన్‌ఎం, పోస్టు బేసిక్
డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ వైద్య విద్యా డెరైక్టరేట్ నోటిఫికేషన్ విడుదల
చేసింది.
ముఖ్య సమాచారం:
జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ
(జీఎన్‌ఎం) అనేది మూడేళ్ల కోర్సు. ఇందులో ఆరు నెలల ఇంటర్నషిప్ కూడా ఉంటుంది. అలాగే
పోస్ట్ బేసిక్ డిప్లొమా కోర్సు కాల వ్యవధి ఒక సంవత్సరం.
అర్హతలు: జీఎన్‌ఎం కోర్సుల్లో
ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఇంగ్లిష్ సబ్జెక్టుతో 40శాతం
మార్కులతో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హతను పూర్తిచేసి ఉండాలి. అలాగే..
ఏఎన్‌ఎం కోర్సు 40 శాతం మార్కులతో పూర్తిచేసిన విద్యార్థులు
కూడా జీఎన్‌ఎం కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 16
ఏళ్లు నిండినవారై 35 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఏఎన్‌ఎం
అభ్యర్థులకు ఎలాంటి వయోపరిమితి నిబంధన లేదు. ఎస్సీ/ఎస్టీ/ బీసీ అభ్యర్థులకు
మూడేళ్లపాటు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పోస్ట్ బేసిక్ డిప్లొమా కోర్సుల్లో
ప్రవేశాలకు రిజిస్టర్డ్ నర్స్, రిజిస్టర్డ్ మిడ్‌వైఫ్ అయి ఉండాలి.
కనీసం ఒక సంవత్సరం నర్స్‌గా అనుభవం పొంది ఉండాలి. వీరికి వయసు 35 ఏళ్ల లోపు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: అకడమిక్‌గా
సాధించిన మెరిట్ లేదా మార్కులను పరిగణనలోకి తీసుకొని ప్రవేశాలను కల్పిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్
15,
2020
దరఖాస్తు ఫీజు చెల్లింపునకు ఆఖరు
తేదీ: అక్టోబర్ 10, 2020
డౌన్‌లోడ్ చేసుకున్న అప్లికేషన్
పంపించాల్సిన తేదీ: అక్టోబర్ 20, 2020
ఎంపిక ప్రక్రియ: నవంబర్ 09, 2020 లోపు పూర్తవుతుంది.
తరగతులు ప్రారంభం: నవంబర్ 16, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://dme.ap.nic.in/
0 Komentar