బీఐఎస్‌లో 171 ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం.
బ‌్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్
(బీఐఎస్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 171 గ్రూప్-ఏ, బీ, సీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
చేసింది.
కేంద్ర వినియోగదారుల వ్యవహారాల
శాఖ పరిధిలోని బ‌్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ (బీఐఎస్) వివిధ విభాగాల్లో
ఖాళీగా ఉన్న 171 గ్రూప్-ఏ, బీ, సీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగినవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష,
ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈనెల 26
వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలను https://bis.gov.in/
వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
మొత్తం పోస్టులు: 171
అసిస్టెంట్ డైరెక్టర్- 4 (లీగల్-1, ఫైనాన్స్-1, మార్కెటింగ్-1,
లైబ్రెరీ-1)
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్-17
పర్సనల్ అసిస్టెంట్-16
జూనియర్ ట్రాన్స్‌లేటర్ (హిందీ)-1
లైబ్రెరీ అసిస్టెంట్-1
స్టెనోగ్రాఫర్-17
సీనియర్ సెక్రటేరియట్
అసిస్టెంట్-79
జూనియర్ సెక్రటేరియట్
అసిస్టెంట్-36
0 Komentar