Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APSET on December 20 .. When is the last date for application ..?


APSET on December 20 .. When is the last date for application ..?
డిసెంబరు 20న ఏపీ సెట్‌.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..?
యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులు పొందాలంటే ఏపీసెట్‌లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది.

రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష(ఏపీసెట్‌)ను డిసెంబరు 20న నిర్వహించనున్నట్లు ఏపీసెట్‌ సభ్య కార్యదర్శి ఆచార్య కె.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుం లేకుండా అక్టోబరు 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నా రు. రూ.1000 అపరాధ రుసుముతో అక్టోబరు 12 వరకు, రూ.2 వేల అపరాధ రుసుముతో అక్టోబరు 21 వరకు, రూ.5 వేల అపరాధ రుసుముతో నవంబరు 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
డిసెంబరు 12 నుంచి https://apset.net.in/ వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని తెలిపారు.

యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులు పొందాలంటే ఏపీసెట్‌లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అభ్యర్థులు కామర్స్, హిస్టరీ, ఎకనమిక్స్ లాంటి 30 సబ్జెక్ట్స్‌లో స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కు దరఖాస్తు చేయొచ్చు. సంబంధిత సబ్జెక్ట్‌లో 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ పాస్ కావాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్‌జెండర్, దివ్యాంగులు 50 శాతం మార్కులతో పాసైతే చాలు. జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1,200. బీసీ అభ్యర్థులకు రూ.1,000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు రూ.700 దరఖాస్తు ఫీజు ఉంటుంది. ఈ పరీక్షను విశాఖపట్నం-ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహిస్తోంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags