Aviation sector impact due to covid-19
అతలాకుతలమైన పౌర విమానయాన రంగం
కోవిడ్ -19 తో రూ. 32,000 కోట్ల ఆదాయం నష్టం, 18,000 ఉద్యోగాలు
ఎగిరిపోయాయి
ప్రభావంతో పౌర విమానయాన రంగం
గింగిరాలు తిరిగింది. కరోనా వైరస్ కారణంగా జాతీయ, అంతర్జాతీయ
విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో మొత్తం వ్యవస్థ అతలాకుతలమైనట్లు కేంద్ర పౌర
విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి బుధవారం రాజ్యసభకు తెలిపారు. గత ఏడాది
మార్చి - జులైతో పోల్చుకుంటే ఈ ఏడాది అదే సమయానికి విమానయానరంగం రూ.32,252 కోట్ల ఆదాయం, 18,027 ఉద్యోగాలు కోల్పోయింది. 5,46,84,965 మంది మేర జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికుల్లో
కోతపడింది. భారతీయ విమానయాన సంస్థలు, విమానాశ్రయ నిర్వాహకులు
అత్యధిక ఆదాయాన్ని కోల్పోయారు. గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గోహ్యాండ్లింగ్
విభాగాల్లో ఎక్కువ ఉద్యోగాలు పోయాయి. మే 25 నుంచి 33%
మేర దేశీయ విమానాల రాకపోకలకు అనుమతివ్వడంతో పరిస్థితులు కొంత
మెరుగుపడ్డాయి. ఆ సంఖ్యను జూన్ 26 నుంచి 45%కి, సెప్టెంబరు 2 నుంచి 60%కి పెంచడంతో ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి. దీనివల్ల రోజువారీ షెడ్యూల్డ్
విమానాల సంఖ్య 428 నుంచి 1,233కి
పెరిగింది. రోజువారీ రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్యా 30,550 నుంచి 1,11,992కి ఎగబాకింది. మహమ్మారికాలంలో విదేశాల
నుంచి భారతీయులను తరలించడానికి ఎయిరిండియా నిర్వహించిన వందే భారత్ మిషన్ ద్వారా
ఎయిరిండియాకు రూ.2,021 కోట్లు, ఎయిరిండియా
ఎక్స్ ప్రెస్ కు రూ.115 కోట్ల ఆదాయం లభించింది.
ఆగస్టులో 76% తగ్గిన ప్రయాణికుల సంఖ్య దేశీయంగా విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య
క్రమంగా పెరుగుతోంది. ఆగస్టులో 28.32 లక్షల మంది దేశీయ
మార్గాల్లో ప్రయాణించారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)
వెల్లడించింది. జులైలో ప్రయాణించిన 21.07 లక్షల మందితో
పోలిస్తే, గత నెలలో మరింతమంది పెరిగారు. కానీ 2019 ఆగస్టులో ప్రయాణించిన 117.98 లక్షల మందితో పోలిస్తే
గత నెలలో ప్రయాణించిన వారు 75.99 శాతం తక్కువగా ఉన్నారు.
ఇండిగో విమానాల్లో 16.82 లక్షల మంది ప్రయాణించడంతో, మార్కెట్ వాటా 59.1
శాతంగా నమోదైంది. స్పైస్ జెట్ 3.91 లక్షల మంది
(18.8 శాతం), ఎయిరిండియా 2.78 లక్షలు (9.8 శాతం), ఎయిరేషియా
ఇండియా 1.92 లక్షల మంది ( 6.8 శాతం),
విస్తారా 1.42 లక్షల మంది (5.0 శాతం), గో ఎయిర్ 1.38 లక్షల మంది
(1.7 శాతం)ని చేరవేశాయి. * 401.17 లక్షలు:
ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు చివరి వరకు దేశీయ విమానాల్లో ప్రయాణించిన వారు * 943.58
లక్షలు: 2019 జనవరి-ఆగస్టులో దేశీయ విమాన
ప్రయాణికుల సంఖ్య, అంటే 8 నెలల
మొత్తంమీద ప్రయాణికుల సంఖ్య 57.48 శాతం తక్కువగా ఉంది.
0 Komentar