Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

B.Tech Release of new curriculum - Quality Education is Social Service



B.Tech Release of new curriculum - Quality Education is Social Service 
బి టెక్ కొత్త పాఠ్యాంశాల విడుదల - నాణ్యమైన చదువు సామాజిక సేవ 

బి టెక్ 10 నెలల ఇంటర్న్ షిప్ తప్పనిసరి
వేసవి సెలవుల్లో కమ్యూనిటీ సర్వీసు
75% హాజరు ఉంటేనే పరీక్షలకు అనుమతి 
ఇంజినీరింగ్ నాణ్యతను, అదే సమయంలో విద్యార్థులకు సామాజిక సేవను అలవర్చడానికి ప్రభుత్వం కసరత్తు చేసింది. అందులో భాగంగా బీటెక్ లో 10 నెలల ఇంటర్న్ షిప్ను తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కొత్త సిలబస్ను విడుదల చేసింది. రెండు, మూడు సంవత్సరాల వేసవి సెలవుల్లో రెండు నెలల చొప్పున చివరి ఏడాదిలో ఆరు నెలలు ఇంటర్న్ షిప్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్న్ షిప్ లో విద్యార్థి సమర్పించే నివేదికకు 40%, ప్రదర్శనకు 60% వెయిటేజ్ ఇస్తారు. ఇది పూర్తి చేయకుంటే వీటికి పట్టాను ప్రదానం చేయరు. ఇక రెండో ఏడాది వేసవి సెలవుల్లో విద్యార్థులు 180 గంటల సామాజిక సేవనూ చేయాలి. ఎస్ఎస్ఎస్/ ఎన్‌సీసీలో తప్పనిసరిగా మొదటి ఏడాదిలో కనీసం 15 గంటలు పాల్గొనాలి.
వీటన్నింటితో పాటు చేసి హాజరు తప్పనిసరి. 10% హాజరు వరకు మినహాయింపు ఇచ్చేందుకు కళాశాల అకడమిక్ కమిటీకి అధికారమిచ్చారు.
 నైపుణ్య ఆధారిత కోర్సులు
ఐదు  నైపుణ్య కోర్సులు ఉంటాయి. విద్యార్థి చదివే డొమైన్‌కు సంబంధించిన రెండు కోర్సు లను రెండో ఏడాదిలో పూర్తి చేయాలి. మిగతా మూడింటిలో సాఫ్ట్ నైపుణ్యాలపై ఒకటి, ఉద్యోగా ధారిత నైపుణ్యాలపై రెండే కోర్సులు ఉంటాయి.
వీటితోపాటు అదనంగా కోర్సులు చదివే వారికి ఆనర్స్ ఇస్తారు. ఆనర్స్ చేయాలనుకునే విద్యార్థులకు రెండో సెమిస్టర్ పూర్తయ్యేసరికి సెమిస్టర్ గ్రేడ్ పాయింట్ సరాసరి (ఎస్జీపీఏ) 1.5 ఉండాలి. మూడో సెమిస్టర్ పూర్తయ్యే సరికి ఈ ఎస్పీపీఏను సాధించాలి. నాలుగో సెమిస్టర్ నుంచి ఆనర్స్ డిగ్రీ ప్రారంభమవుతుంది.
క్రెడిట్లు ఇలా... నాలుగో ఏడాది చివరి సెమిస్టర్‌లో మేజర్ ప్రాజెక్టు కింద ప్రాజెక్టు వర్క్, సెమి నార్, పరిశ్రమలో ఇంటర్న్ షిప్ కు 14 క్రెడిట్లు ఉంటాయి. మొదటి సంవత్సరంలో ల్యాబ్ 8.5 క్రెడిట్లు కేటాయించారు.
క్రెడిట్లు మొదటి ఏడాది 38.5 రెండో సంవత్సరం 43, మూడో సంవత్సరం 43, నాలుగో సంవత్సరం 35.5.

• విద్యార్థి తప్పనిసరిగా నాలుగు కోర్సులు పూర్తి చేయాలి. ఒక్కోదానికి నాలుగు క్రెడిట్లు
ఉంటాయి. మొత్తం 20 క్రెడిట్లు రావాలి.
• విద్యార్థులు తాము చదువుతున్న బ్రాంచి కాకుండా వేరే బ్రాంచిలోనూ ఆనర్స్ మైనర్ డిగ్రీ పూర్తి చేసుకునే అవకాశముంది. మెకానికల్ విద్యార్థి సివిల్ నుంచి కొన్ని సబ్జెక్టులను ఎంచు కోవచ్చు. మెకానికల్ లో మేజర్ డిగ్రీ సివిల్ లో మైనర్ డిగ్రీ వస్తుంది.
విరామ సంవత్సరం
పూర్తిస్థాయి ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా మారాలనుకునే విద్యార్థి మూడేళ్లలో ఎప్పుడైనా ఏడాది విరామం తీసుకోవచ్చు. దీన్ని రెండేళ్లకు పొడిగించవచ్చు. విద్యార్థి సమర్పించే నివేదిక ఆధారంగా విశ్లేషణ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంటుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags