చాలా తక్కువ ధరతో మిక్కిలి పోషకాలతో మనకు లభ్యమవుతున్న పండ్లలో అరటి పండు కూడా ఒకటి. దీంట్లో మన శరీరానికి కావల్సిన ఎన్నో కీలకమైన పోషకాలు ఉన్నాయి. తరచూ అరటి పండ్లను తింటుంటే దాంతో పలు అనారోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చని మనకు తెలిసిందే. అయితే కేవలం అరటి పండే కాదు, ఆ చెట్టుకు చెందిన పూవుతో కూడా మనకు అనేక లాభాలు ఉన్నాయి. అరటి పండు లాగే పూవును కూడా మనం తినవచ్చు. దాంతో అరటి పండు ద్వారా లభించినట్టే మనకు ఎన్నో పోషకాలు అరటి పూవు ద్వారా లభిస్తాయి. కానీ అరటి పండును డైరెక్ట్‌గా అలా కాకుండా కూర వండుకున తినాలి. దీంతో టేస్ట్‌కు టేస్ట్, పోషకాలకు పోషకాలు కూడా లభిస్తాయి.
అరటి పూవు కూర తయారీ విధానం:
ఒక పాత్రలో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేయాలి. అనంతరం అందులో పోపు గింజలను వేయాలి. అవి వేగాక పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ముక్కలుగా కట్ చేసిన అరటి పూవును వేయాలి. దాంతోపాటు ఉప్పు, కొద్దిగా ఇంగువ, కరివేపాకులు, ధనియాల పొడి, కొత్తిమీర, పసుపు కూడా వేయాలి. అనంతరం కొంత నీరు పోసి పాత్రపై మూత పెట్టేయాలి. కొంత సేపటి తరువాత సన్నగా తురిమిన కొబ్బరి పొడిని వేయాలి. దీంతో అరటిపూవు కూర రెడీ అవుతుంది.
పైన చెప్పిన అరటి పూవు కూరను తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. అరటి పూవు కూరను తరచూ
తింటుండడం వల్ల స్త్రీలకు రుతుక్రమం సరిగ్గా ఉంటుంది. ఆ సమయంలో వచ్చే
ఇబ్బందులన్నీ ఉండవు.
2. పాలిచ్చే తల్లులకు ఇది
మంచి ఆహారం. చాలా పోషకాలు లభించడం వల్ల అటు తల్లికి, ఇటు
శిశువుకు కూడా మంచి చేస్తుంది.
3. డయాబెటిస్ ఉన్నవారు అరటిపూవు
కూరను తరచూ తింటుంటే వారి రక్తంలోని చక్కెర స్థాయిలు క్రమంగా తగ్గిపోతాయి.
షుగర్ అదుపులోకి వస్తుంది.
4. రక్తహీనత ఉన్నవారు
అరటి పూవు కూరను తరచూ తినాలి. దీంతో రక్తం బాగా పడుతుంది. రక్తం వృద్ధి
చెందుతుంది.
5. మూత్రపిండాల వ్యాధులతో
ఇబ్బందులు పడే వారు అరటిపూవు కూరను తినడం మంచిది. దీంతో ఆ సమస్యల నుంచి ఉపశమనం
లభిస్తుంది.
6. అరటిపూవు కూర వల్ల
జీర్ణ సంబంధ సమస్యలు పోతాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటివి దూరమవుతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
7. జీర్ణాశయంలో అల్సర్లు
ఉన్నవారు అరటి పూవు కూరను తినాలి. దీంతో అల్సర్లు తగ్గుతాయి.
8. హైబీపీ అదుపులో ఉంటుంది.
తద్వారా గుండె సంబంధ వ్యాధులు రావు.
9. స్త్రీలలో గర్భాశయ
సంబంధ సమస్యలు తొలగిపోతాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే.
0 Komentar