BITSAT 2020 Admit Cards Released - Exam
Procedure
బిట్ శాట్ 2020 అడ్మిట్‌కార్డులు
విడుదల.. పరీక్ష విధానం, ప్రిపరేషన్ టిప్స్ ఇవే..!
బిట్స్ కాలేజీల్లో ప్రవేశాల కోసం
నిర్వహించే బిట్‌శాట్-2020 అడ్మిట్ కార్డులను బిట్స్ పిలాని
విడుదల చేసింది.
BITSAT 2020 అడ్మిట్‌కార్డులు
విడుదల.. పరీక్ష విధానం, ప్రిపరేషన్ టిప్స్ ఇవే..!
దేశంలోని ప్రతిష్ఠాత్మక బిట్స్
కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే బిట్‌శాట్-2020 అడ్మిట్
కార్డులను బిట్స్ పిలాని విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు
అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ https://www.bitsadmission.com/ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.
పరీక్ష తేదీలు: సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు, సెప్టెంబర్
21 నుంచి 23 వరకు జరుగుతాయి.
ఈ ప్రవేశపరీక్ష ద్వారా బిట్స్
పిలానీ,
హైదరాబాద్, గోవా క్యాంపసుల్లో డిగ్రీ
కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశ పరీక్ష మొత్తం 3 గంటలు ఉంటుంది. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ,
ఇంగ్లిష్ ప్రొఫిషియెన్సీ, లాజికల్ రీజనింగ్,
బయాలజీ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
నాణ్యమైన ఇంజినీరింగ్, సైన్స్
కోర్సులు చదువుతూనే పరిశోధనకు ఆస్కారం, పారిశ్రామిక అనుభవం
పొందాలనుకుంటే బిర్లా సంస్థలు చక్కని గమ్యస్థానం. ఇంటర్మీడియట్ చదివినవారికి మూడు
రకాల ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తోంది బిట్స్.
(ఇంటిగ్రేటెడ్ డిగ్రీలో చదువుతున్న ప్రధాన కోర్సుతో పాటు విద్యార్థి ఆసక్తి,
ప్రతిభలను బట్టి మైనర్ ప్రోగ్రాంలో కోర్సులనూ పూర్తిచేయవచ్చు.
బీఈ: కెమికల్, సివిల్,
కంప్యూటర్ సైన్స్, ఎల‌్రక్టికల్ అండ్
ఎలక్ట్రానిక్స్, ఎల‌్రక్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్,
ఎల‌్రక్టానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్,
మాన్యుఫ్యాక్చరింగ్, బయో టెక్నాలజీ విభాగాలు.
బీఫార్మసీ: ఈ కోర్సుకు ఫార్మసీ
కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉంది.
ఎమ్మెస్సీ: మ్యాథ్స్, ఫిజిక్స్,
కెమిస్ట్రీ, బయలాజికల్ సైన్సెస్, ఎకనామిక్స్, జనరల్ స్టడీస్.
బిట్‌శాట్ పరీక్ష ఇలా..!
ఇది ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించే
కంప్యూటర్ ఆధారిత పరీక్ష. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. ఇందులో 4
విభాగాలుంటాయి.
పార్ట్ -1: ఫిజిక్స్ 40
పార్ట్- 2: కెమిస్ట్రీ 40
పార్ట్- 3: ఎ. ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ 15, బి. లాజికల్
రీజనింగ్ 10
పార్ట్- 4: మ్యాథ్స్ / బయాలజీ (బీఫార్మసీ కోసం) 45 ప్రశ్నలు
వస్తాయి.
మొత్తం 150 ప్రశ్నలు. వీటికి 3 గంటలు కేటాయించారు. సరైన జవాబుకు
3 మార్కులు. తప్పుగా గుర్తిస్తే ఒక మార్కు చొప్పున
తగ్గిస్తారు.
0 Komentar