Center gave Clarity on the rumours Rs 2,000
note will be banned in the country
దేశంలో రూ.2
వేల నోట్ పరిస్థితి ఏంటి? కేంద్రం క్లారిటీ
ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి రూ.2
వేల నోట్లు దేశంలో 27,398 లక్షల నోట్లు చెలామణిలో ఉన్నాయి. 2019 మార్చి 31కి ఆ సంఖ్య 32,910
లక్షలుగా ఉంది.
దేశంలో రూ.2
వేల నోటును కూడా బ్యాన్ చేస్తారేమోననే వదంతులు ఉన్న వేళ ఆ అంశంపై కేంద్ర ప్రభుత్వం
ఓ స్పష్టత ఇచ్చింది. రూ.2 వేల నోటు ముద్రణను ఆపివేసే ఆలోచన
ఇప్పటికైతే ఏమీ లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ శనివారం లోక్‌సభలో
వెల్లడించారు. అతి పెద్ద నోటుపై స్పష్టత కోరుతూ ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు అనురాగ్
ఠాకూర్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. లావాదేవీల సులభ నిర్వహణకు బ్యాంకు నోట్ల
ముద్రణ విషయంలో నిర్ణయాన్ని ఆర్‌బీఐను సంప్రదించి ప్రభుత్వం ముందడుగు వేస్తుందని
వివరించారు. అంతేకాక, దేశంలో రూ.2 వేల
నోటు చెలామణి అవుతున్న స్థితిని కూడా అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈ
ఏడాది మార్చి నెలాఖరు నాటికి రూ.2 వేల నోట్లు దేశంలో 27,398 లక్షల నోట్లు చెలామణిలో ఉన్నాయి. 2019 మార్చి 31కి ఆ సంఖ్య 32,910 లక్షలుగా ఉంది. దేశవ్యాప్త లాక్
డౌన్ కారణంగా నోట్ల ముద్రణ కూడా తాత్కాలికంగా నిలిచిపోయిందని ఆర్‌బీఐ గతంలో
ప్రకటించినట్లుగా అనురాగ్ ఠాకూర్ గుర్తు చేశారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ముద్రణ ప్రక్రియను కూడా భారతీయ
రిజర్వు బ్యాంకు దశలవారీగా ప్రారంభించిందని వెల్లడించారు.
0 Komentar