Center Guidelines for Class 9-12
students
క్లాస్ 9-12 విద్యార్థుల కోసం కేంద్రం గైడ్ లైన్స్
నోట్స్, పెన్నులు
మార్చుకోరాదు
ఆరేసి అడుగుల దూరంలో సీటింగ్
21 నుంచి పాక్షికంగా తెరుచుకోనున్న స్కూళ్లు
స్కూళ్లలో జంక్ ఫుడ్ నిషేధం
తొమ్మిది నుంచి పన్నెండో తరగతి
విద్యార్థులకు ఈనెల 21నుంచి పాక్షికంగా తెరుచుకోనున్న స్కూళ్లలో
పాటించాల్సిన నియమా లపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కొన్ని మార్గదర్శ కాలు జారీ
చేసింది. వీటి ప్రకారం... స్కూళ్లలోకి రాక, పోక అన్నీ క్యూ
పద్ధతిలోనే జరగాలని, గుంపులు గుంపులుగా రావడం పోవడం జరగరాదని
స్పష్టం చేసింది. కొవిడ్ ఉదృతి కారణంగా పరస్పరం తాకకుండా భౌతిక దూరం పాటించేట్లు
చూడాలని అందులో కోరింది. "విద్యార్థినీ విద్యార్థులు తమ పెన్నులు, పెన్సిళ్లు, నోట్సులు, ఇతర
ఉపకరణాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకోరాదు. వాటర్ బాటిళ్లు కూడా పంచుకోరాదు. క్లాస్
రూంలో కనీసం ఆరడుగుల దూరంలో వారు కూర్చునేట్లు సీటింగ్ అరేంజ్ మెంట్ సిద్ధం
చేయాలి. ఉపాధ్యాయులు సైతం ఎవరినీ తాక కుండా బాధ్యతలు నిర్వర్తించాలి. విద్యార్థులు
తప్పనిసరిగా మాస్కులు, లేదా ఫేస్ షీల్లులు ధరించాలి.
ఎక్కడికక్కడ శాని టైజర్లు సిద్ధం చేయాలి. సబ్బులు, థర్మల్
గన్స్, ఒక శాతం సోడియం హైపోక్లోరేట్ ద్రావణాలు, డిస్పోజబుల్ పేపర్ టవల్స్, ఐఈసీ ఉపకరణాలు... ఇవన్నీ
అందుబాటులో ఉండాలి. వీటికి తోడు ఆక్సిజన్ లెవల్స్ పరిశీలించడానికి ఆక్సీ మీటర్లు
కూడా తప్పనిసరిగా ఉండాలి. ప్రవేశ మార్గం వద్ద తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్
జరపాలి. రిసెప్షన్, స్టాఫ్ రూంలు, లైబ్రరీ,
మెస్సులు, కేఫీరియా ... మొదలైన వాటి చోట్ల
ఎవరూ గుమిగూడకుండా భౌతిక దూరం పాటించేట్లు
చేయాలి. ఆన్లైన్ టీచింగ్ కు
ప్రాధాన్యం ఇవ్వాలి. కనీసం సగం మంది విద్యార్థులు ఆన్లైన్ ద్వారా నేర్చుకునేట్లు
చేయాలి. కొవిడ్ లక్షణాలున్న వారిని ఎవరినీ అనుమతించ రాదు" అని ఆ గైడ్ లైన్లో
పేర్కొన్నారు. ఎక్కువగా ఉపయో గించే ఉపరితలాలను అంటే తలుపులు, రెయిలింగ్లు,
లిప్పులు, వారూంలను సోడియం హైపోక్లోరేట్
ద్రావణంతో నిరంతరం శానిటైజ్ చెయ్యాలని సూచించింది. అసెంబ్లీ, స్పోర్ట్స్ పీరియడ్ లను రద్దు చేయాలని కోరింది. విద్యార్థులకు రవాణా
సౌకర్యం కూడా స్కూలే కల్పిస్తే అందులోనూ భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేసింది.
స్కూళ్లలో జంకఫుడ్ నిషేధం
పాఠశాల క్యాంటీన్లు, హాస్టళ్ల
లో చిరుతిళ్లను విక్రయించరాదని ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ(ఎస్ఎస్ఎస్ఏఐ) స్పష్టం
చేసింది. “స్కూళ్లకు 50 మీటర్ల పరిధిలోనూ జంక్ ఫుడ్
అమ్మరాదు. స్కూళ్ల సమీపంలో, పాఠశాల ప్రాంగణాల్లో
తినుబండారాలకు సంబంధించిన ప్రకటనలు, హోర్డింగ్లు, పోస్టర్లు పెట్టరాదు. ఈ నియంత్రణ వెంటనే అమలు చేయాలి. స్కూలు ఎంట్రన్లో
పెద్ద బోరు మీద "తినుబండారాలు అమ్మడం, జంక్ ఫుడ్
విక్రయించడం నిషేధం. ప్రకటనలూ నిషేధం" అని రాసి పెట్టాలని ఆ సంస్థ తేల్చి
చెప్పింది. “అతిగా ఉప్పు, తీపి కలిపిన పదార్థాలను, కొవ్వును ప్రోది చేసే తినుబండారాలను స్కూళ్లలో అమ్మరాదు" అని
కోరింది.
0 Komentar