Central reforms to meet tomorrow's
educational needs - Vice President Venkaiah Naidu
Ramachandra Mission Essay Competitions -
2020 Beginning
రేపటి విద్యావసరాలు తీర్చేందుకు కేంద్ర
సంస్కరణలు - ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
రామచంద్రమిషన్ వ్యాసరచన పోటీలు- 2020 ప్రారంభం
రేపటి విద్యావసరాలను తీర్చేందుకు
కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో అనేక సంస్కరణలను చేపడుతోందని ఉపరాష్ట్రపతి వెంకయ్య
నాయుడు అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ గ్రామ పంచాయతీ పరిధిలోని
శ్రీరామ చంద్రమిషన్ హార్ట్ ఫుల్‌నెస్, ఐర్యరాజ్యసమితి సమాచార
కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'ఆల్ ఇండియా
ఎస్సే రైటింగ్ ఈవెంట్- 2020"ను శుక్రవారం ఆయన ఆన్లైన్ లో
ప్రారంభించారు. యువతను సరైన మార్గంలో నడిపించడానికి హార్ట్ ఫుల్‌నెస్ సంస్థ
చేస్తున్న కృషిని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. దేశ నిర్మాణంలో
యువత పాత్ర కీలకమని
శ్రీరామచంద్రమిషన్ గురూజీ కమలేష్ పటేల్ అన్నారు. దేశవ్యాప్తంగా ఆంగ్లం, హిందీతో
పాటు మరో తొమ్మిది ప్రాంతీయ భాషల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
పోటీల్లో పాల్గొనే విద్యార్థులు అక్టోబరు 10 వరకు తమ
వ్యాసాలను www.younghearts.org లో సమర్పించాలని చెప్పారు.
విభాగాలు, వ్యాసాంశాల వివరాలకు. అదే వెబ్ సైట్ ను
సందర్శించాలని సూచించారు. మొదటి 10 వ్యాసాలకు
బహుమతులివ్వనున్నట్లు చెప్పారు. మెంట్ ధ్రువపత్రాలు అందజేయనున్నట్లు వివరించారు.
0 Komentar