Check for unnecessary in-built apps ..!
అనవసర యాప్ లకు చెక్..!
మొబైల్ ఫోన్లలో అనవసర యాప్ లకు చెక్ పెట్టాలని కేంద్రం యోచిస్తోంది. సాధారణంగా
అవసరమైన వాటిని మాత్రమే ఎంచుకొనే సదుపాయం వినియోగదారులకు లేకుండా చాలా యాప్ లు ముందు గానే ఫోన్లలో నిక్షిప్తమై ఉంటున్నాయి.
ఇలాంటి యాప్లను నియంత్రించేందుకు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ త్వరలో కొత్త
విధానాన్ని ప్రవేశ పెట్టబో తోంది. ఈ విధానం ద్వారా తమకు ఇష్టమైన యాప్లనే ఫోన్లో
నిక్షిప్తం చేసుకొనే వెసులుబాటు వినియోగదారులకు కలుగుతుంది. ఇటీవల వినియో గదారుల
వ్యక్తిగత సమాచారం చోరీకి సంబంధించిన కేసులు గణనీయంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం నూతన
విధానం వైపు దృష్టి సారించింది.
0 Komentar