RRB NTPC పరీక్షకు దరఖాస్తు
చేసుకున్నారా..? అయితే అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి
ఎన్‌టీపీసీ అభ్యర్థులు తమ
అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి అవకాశం ఆర్ఆర్‌బీ కల్పించింది.
ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షలకు
సమయం దగ్గర పడుతోంది. దీంతో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతంగా చేస్తున్నారు.
డిసెంబర్ 15 నుంచి పరీక్షలు ఉంటాయని ఇప్పటికే రైల్వే రిక్రూట్‌మెంట్
బోర్డ్ (RRB) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్‌టీపీసీ
అభ్యర్థులు తమ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి అవకాశం ఆర్ఆర్‌బీ
కల్పించింది. అప్లికేషన్ స్టేటస్ లింక్ యాక్టివేట్ చేసింది.
ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అభ్యర్థులు
తమ అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారా లేదా రిజెక్ట్ చేశారా అన్నది చెక్ చేసుకోవాలి. తమ
అప్లికేషన్ యాక్సెప్ట్ చేసి ఉంటారని పట్టించుకోకపోతే తర్వాత పరీక్ష రాసే
అవకాశాన్ని కోల్పోయే ఛాన్స్ ఉంది. అందుకో అభ్యర్థులందరూ ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్
http://rrbonlinereg.co.in/
లో తమ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలి.
ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అభ్యర్థులు
సెప్టెంబర్ 30 వరకు తమ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఆర్ఆర్‌బీ
ఎన్‌టీపీసీ నోటిఫికేషన్ ద్వారా రైల్వేలో 35 వేలకు పైగా
పోస్టులు భర్తీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు 1,26,30,88 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ అప్లికేషన్
స్టేటస్
ఇలా చెక్ చేసుకోండి:
మొదటగా http://rrbonlinereg.co.in/
వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో Application
Status లింక్ క్లిక్ చేయండి.
అన్ని ఆర్ఆర్‌బీ రీజియన్స్ జాబితా
కనిపిస్తుంది.
అందులో మీరు ఏ రీజియన్ నుంచి
దరఖాస్తు చేసుకుంటే.. ఆ రీజియన్ సెలెక్ట్ చేయండి.
సికింద్రాబాద్ రీజియన్ అభ్యర్థులు
ఇక్కడ క్లిక్ చేయండి
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
అందులో మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన
తేదీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అయిన
తర్వాత స్క్రీన్ పైన మీ అప్లికేషన్ స్టేటస్ కనిపిస్తుంది.
మీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తే
మీరు పరీక్ష రాయడానికి అర్హత సాధించినట్లు లెక్క.
ఆ వివరాలను ప్రింట్ తీసుకొని కాపీ
భద్రపర్చుకోండి.
ఒకవేళ అప్లికేషన్ రిజెక్ట్ అయితే
ఎందుకు రిజెక్ట్ అయిందో కారణంతో సహా ఉంటుంది.
ఫోటోలు, సంతకం
సరిగ్గా లేకపోవడం, అప్లికేషన్ ఫామ్ పూర్తిగా నింపకపోవడం,
విద్యార్హతలు లేకపోయినా దరఖాస్తు చేయడం లాంటి కారణాలతో దరఖాస్తులు
రిజెక్ట్ అయ్యే అవకాశముంది.
0 Komentar