Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

China handed over missing five Indians



China handed over missing five Indians
ఐదుగురు భారతీయులను అప్పగించిన చైనా
అపహరణకు గురైన ఐదుగురు భారతీయ పౌరులను చైనా ఎట్టకేలకు విడిచి పెట్టింది. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ఈ వేటగాళ్లు సెప్టెంబరు 1నుంచి కనిపించకుండా పోయారు. పొరబాటున సెప్టెంబర్ 2న వాస్తవాధీన రేఖను దాటివెళ్లిన భారతీయులను నేడు చైనా తిరిగి అప్పగించినట్టు భారత భద్రతా దళాలు ప్రకటించాయి. కాగా, అప్పగింత ప్రక్రియ ఈ ఉదయం చైనా భూభాగంలో చోటుచేసుకుంది. విడుదలైన వారు కిఖిథు సరిహద్దు పోస్టు గుండా భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ కు చేరుకునేందుకు సుమారు గంట సమయం పడుతుంది.
ఇండో టిబెటన్ భద్రతా దళాలు స్థానికులను సహాయకులుగా, గైడ్లుగా వినియోగించుకుంటాయి. తమకు అవసరమైన సామగ్రిని, మెక్ మోహన్ రేఖ వెంబడి ఉన్న సైనిక స్థావరాలకు చేర్చేందుకు కూడా వీరి సహాయం తీసుకుంటాయి. ఈ క్రమంలో అరుణాచల్ ప్రదేశ్ లో సుబన్ సిరి జిల్లా కేంద్రం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాచో ప్రాంతానికి చెందిన కొందరు దారి తప్పిపోయారు. సరిహద్దుల వెంట వారిని చైనా సైన్యం అపహరించింది. వారు కనపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు భారతీయ సైన్యానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై సంప్రదించగా.. చైనా భద్రతాదళం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తొలుత తమకేమీ సంబంధం లేనట్టు వ్యవహరించింది. అనంతరం వారు తమ ఆధీనంలోనే ఉన్నట్టు మంగళవారం ప్రకటించింది. ఇదే విధంగా దారితప్పి భారత భూభాగంలోకి వచ్చిన చైనీయుల పట్ల భారత రక్షణ దళాలు మానవతా దృష్టితో వ్యవహరించటమే కాకుండా.. వారికి వెచ్చని దుస్తులు, ఆహారం అందించి మరీ తిరిగి వెళ్లేందుకు తోవ చూపించాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వేదికలపై మరింత విమర్శలకు గురౌతామనే ఆలోచనతో చైనా దిగివచ్చినట్టు పలువురు భావిస్తున్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags