Condolences to Pranab's death till
September 6
ప్రణబ్ మృతికి సెప్టెంబర్ 6వరకు
సంతాపదినాలు
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
పరమపదించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా 7 రోజులపాటు సంతాప దినాలుగా
పాటించాలని ప్రకటించింది. "ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 6 వరకు" దేశవ్యాప్తంగా సంతాప దినాలుగా పేర్కొంది.
ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్
రిఫరల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రణబ్ ముఖర్జీ సోమవారం పరమపదించారు. ఆయన
మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య
నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర
మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్
మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాష్ట్రాల ముఖ్యమంత్రులు
దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రణబ్ ముఖర్జీ పట్ల గౌరవ భావంతో 7
రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రపతి భవన్‌పై జాతీయ జెండాను
అవనతం చేశారు.
అదేవిధంగా దేశవ్యాప్తంగా అన్ని
ప్రభుత్వ కార్యాలయాలపైన జాతీయ జెండాను అవనతం చేస్తారు.
ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 6 వరకు సంతాప దినాల్లో అధికారిక
వినోద కార్యక్రమాలు నిర్వహించరాదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశ
వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలపైనా జాతీయ జెండాను అవనతం చేయాలని పేర్కొంది.
0 Komentar