Corona treatment will be added to Aarogya
Sri - KCR
కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో
చేరుస్తాం - కెసిఆర్
కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి
తెచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు
ప్రకటించారు. దీనిపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
అలాగే కరోనా చికిత్స పొందిన పేదలకు సీఎంఆర్ఎఫ్ కింద సాయం చేస్తామని తెలిపారు.
కరోనాపై బుధవారం జరిగిన స్వల్పకాలిక చర్చ అనంతరం సీఎం కేసీ ఆర్ మాట్లాడారు. బీజేపీ
ప్రభుత్వం కేంద్రంలో తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ కంటే మన ఆరోగ్యశ్రీ ఎన్నో రెట్లు
పటిష్టంగా ఉందని చెప్పారు. ఐసీఎంఆర్ 15 ఆసుపత్రులకు
అనుమతినిచ్చింది.
NRHM నుంచి రూ.265 కోట్లు మాత్రమే వచ్చాయి. మరో రూ.90 కోట్లు ఇచ్చారు. కేంద్రం 647 వెంటిలేటర్లు ఇచ్చింది. వాటినీ గ్రాంట్లో కట్ చేస్తారు. ఏదీ ఉచితంగా ఇవ్వలేదు. రుణం రూపంలోనూ రాలేదు. - కరోనాతో కలసి బతకాల్సిందే. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో ఆరోగ్య రంగానికి గణనీయంగా బడ్జెట్ పెంచాలన్నదే కరోనా చెప్పిన గుణపాఠం.

0 Komentar