Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Corona was born in the Wuhan lab: China virologist Li-Meng Yan sensational comments



Corona was born in the Wuhan lab : China virologist sensational comments
వుహాన్ ల్యాబ్‌లోనే కరోనా పుట్టింది,శాస్త్రీయ ఆధారాలున్నాయి: చైనా వైరాలజిస్ట్ వ్యాఖ్యలు
ప్రాణాంతక కరోనా వైరస్‌ను చైనా సృష్టించిందని, దీనిని వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలోనే జన్యుపరంగా తయారుచేశారని పలు దేశాలు ఆరోపణలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే.

ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి సహజసిద్ధమైంది కాదని, చైనా ల్యాబ్‌లోనే పురుడుపోసుకుందని అమెరికా సహా పలు దేశాలు ఆరోపణలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా చైనా వైరాలజిస్ట్ విడుదల చేసిన ఓ వీడియో ఈ ఆరోపణలకు బలం చేకూరేలా ఉన్నాయి. కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్‌లోనే పుట్టిందని, దీనికి సంబంధించి తన వద్ద శాస్త్రీయ ఆధారాలున్నాయని డాక్టర్‌ లీ మెగ్‌ యాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. హాంగ్‌కాంగ్‌లోని స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌‌లో కరోనా వైరస్‌పై గతేడాది నుంచి పరిశోధనలు చేస్తోన్న లీ.. ఆమె పలు విషయాలను వెల్లడించారు.

న్యుమోనియాపై పరిశోధనలు చేసే సమయంలోనే ఈ ప్రాణాంతక కరోనా వైరస్‌ వుహాన్‌లోని ల్యాబ్‌లో తయారైనట్లు గుర్తించానని, అది పూర్తిగా చైనా ప్రభుత్వ నియంత్రణలో ఉంటుందని అన్నారు. వైరస్‌కు సంబంధించి తాను హెచ్చరికలు చేసినప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ, చైనా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రమాదకరమైన వైరస్‌ విషయంలో ప్రపంచాన్ని అప్రమత్తం చేయకుండా నా హెచ్చరికలను బేఖాతరు చేశారని వ్యాఖ్యానించారు.

ఈ వైరస్‌ ప్రకృతి నుంచి సహజసిద్ధంగా పుట్టింది కాదని, అది వుహాన్‌ ల్యాబ్‌లోనే పుట్టిందనడానికి నా దగ్గర సాక్ష్యాలున్నాయన్నారు. ప్రపంచాన్ని మభ్యపెట్టడానికే సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌లోనే కరోనా వైరస్ పుట్టిందని ప్రచారం చేశారని తెలిపారు. ఒకరి నుంచి ఇంకొకరికి వైరస్ వ్యాప్తిచెందుతున్న విషయాన్ని కూడా దాచిపెట్టారని, అధిక జన్యుపరివర్తన కలిగిన సార్స్-కోవి-2 వ్యాప్తి మొదలైతే ఎవరూ నియంత్రించలేరనేది వారికి తెలుసున్నారు.

వైరస్‌ విషయమై మాట్లాడినందుకు చైనా అధికారులు బెదిరింపులకు పాల్పడ్డారు. తనపై దుష్ప్రచారం చేయడంతో పాటు పరిశోధనకు చెందిన సమాచారం మొత్తం ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ప్రాణభయంతో ఆ తర్వాత తాను ఆమెరికాకు పారిపోవాల్సి వచ్చిందని వివరించారు. అయితే, లీ ఆరోపణలను వుహాన్‌ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ యువాన్‌ జిమింగ్‌ మాత్రం తోసిపుచ్చారు. కానీ, ఈ వీడియోపై చైనా అధికారులు ఇప్పటి వరకూ స్పందించకపోవడం గమనార్హం.

Previous
Next Post »
0 Komentar

Google Tags