Coronavirus: Put
a pinch of wheat flour to tell if your sanitizer is good or not?
చెంచాడు గోధుమ పిండి చాలు మీ శానిటైజర్ మంచిదో కాదో చెప్పడానికి..
కరోనావైరస్ సోకకూడదంటే నిత్యం
చేతులు కడుక్కుంటూ ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. చేతులు కడుక్కునే అవకాశం
లేనప్పుడు శానిటైజర్ రాసుకోవాలని సూచిస్తున్నారు.
దీంతో శానిటైజర్ల వాడకం విపరీతంగా
పెరిగింది. ఇళ్లలో, పనిచేసే చోట, బయట
దుకాణాల్లో... ఇలా ప్రతి చోటా శానిటైజర్ వాడకం మొదలైంది.
అయితే, ఈ
పరిస్థితిని ఉపయోగించుకుని కొన్ని సంస్థలు అక్రమంగా లాభాలు పొందాలని చూస్తున్నాయి.
నాసిరకం, కల్తీ ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. ‘’99.9% వైరస్‌లను చంపేస్తుంది’, ‘పరిమళభరిత శానిటైజర్’,
‘ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్’... ఇలా రకరకాలుగా చెబుతూ మార్కెట్లో
శానిటైజర్లు విక్రయిస్తున్నారు. ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లు కరోనావైరస్ నుంచి
మెరుగైన రక్షణ కల్పిస్తాయని నిపుణులు అంటున్నారు. ఎక్కువ మంది వీటినే
వాడుతున్నారు.
వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం
పనిచేసే కన్జ్యూమర్స్ గైడెన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇటీవల ముంబయి, థానె,
నవీ ముంబయిల్లో శానిటైజర్స్ శాంపిల్స్‌ను సేకరించి, వాటిని విశ్లేషించింది. వాటిలో 50 శాతానికిపైగా
నాసిరకమైనవేనని తేల్చింది.
తాము సేకరించిన శాంపిళ్లపై గ్యాస్
క్రొమటోగ్రఫీ పరీక్షలు చేసినట్లు కన్జ్యూమర్స్ గైడెన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా గౌరవ కార్యదర్శి
డాక్టర్ ఎం.ఎస్.కామత్ చెప్పారు.
‘’45 శాంపిళ్లలో కల్తీ
జరిగినట్లు మేం గుర్తించాం. ఆయా శానిటైజర్ల సీసాలపై ముద్రించినట్లుగా అందులోని
పదార్థాలు లేవు. కొన్ని శానిటైజర్లలో మిథైల్ (మిథనాల్ ఆల్కహాల్) ఉంది. దాని
వాడకంపై నిషేధం ఉన్నా, విరివిగా ఉపయోగిస్తున్నారు. దానిని
ఉపయోగించి తయారుచేసే శానిటైజర్లతో ప్రజలకు ఆరోగ్యానికి ప్రమాదం ఉంది. కానీ,
అవి బ్రాండెడ్ శానిటైజర్లుగా ప్రచారం అవుతున్నాయి’’ అని ఆయన
చెప్పారు.
‘‘ప్రపంచ ఆరోగ్య సంస్థ
(డబ్ల్యూహెచ్ఓ) శానిటైజర్లకు ఫార్ములాను సూచించింది. దాని ప్రకారమే వాటిని తయారు
చేయాలి. ఇథైల్ ఆల్కహాల్ మోతాదు తక్కువైనా, శానిటైజర్ సరిగ్గా
ప్రభావం చూపలేదు. కాబట్టి, అది ఎక్కువగా ఉండేలా చర్యలు
తీసుకోవాలి. తనిఖీలు పెంచుతాం. అక్రమాలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత
శాఖకు ఆదేశాలు ఇచ్చాం’’ అని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ థోపె బీబీసీతో
అన్నారు.
మరి, ఏ శానిటైజర్
మంచిదో తెలుసుకోవడం ఎలా?
ఓ చిన్న పరీక్ష ద్వారా ఈ విషయం
తేల్చేయొచ్చని చెబుతున్నారు డాక్టర్ కపూర్.
‘‘ఒక చెంచాడు గోధుమ పిండి
తీసుకొని, దానికి శానిటైజర్ కలపండి. ఒకవేళ పిండి అతుక్కుపోతే
శానిటైజర్ మంచిది కాదని అర్థం. పిండి పొడిగానే ఉంటే, అది
మంచిదని అర్థం’’ అని ఆమె చెప్పారు.
For practical proof WATCH THIS VIDEO
For practical proof WATCH THIS VIDEO
0 Komentar