Diploma students should be given lateral
admissions in Engineering courses: AICTE
డిప్లొమా విద్యార్థులకు ఇంజనీరింగ్
కోర్సుల్లో లేటరల్ ప్రవేశాలు కల్పించాల్సిందే: ఏఐసీటీఈ
డిప్లొమా విద్యార్థుల విషయంలో
ఏఐసీటీఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
బీఎస్సీ విద్యార్థులకూ అవకాశం
కల్పించాలి
ఇంజనీరింగ్ కాలేజీలకు ఏఐసీటీఈ
ఉత్తర్వులు
డిప్లొమా విద్యార్థులను ఇంజనీరింగ్
కోర్సుల్లో నేరుగా సెకండియర్‌లోకి (లేటరల్ ఎంట్రీ) చేర్చుకోవాల్సిందేనని ఏఐసీటీఈ
ఉత్తర్వులు జారీచేసింది. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు డిప్లొమా విద్యార్థులకు
లేటరల్ ఎంట్రీ కల్పించడం లేదని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలు
విడుదల చేసింది.
డిప్లొమాలో 45% మార్కుల (రిజర్వ్‌డ్ కేటగిరీకైతే 40%)తో పాస్
అయిన ఏ విద్యార్థికైనా ఇంజనీరింగ్ సెకండియర్ కోర్సులో చేర్చుకోవాల్సిందేనని
స్పష్టంచేసింది. అలాగే యూజీసీ గుర్తింపు పొందిన ఏ యూనివర్శిటీ నుంచైనా బీఎస్సీ
పట్టా (సాధారణ కేటగిరీ 45%, రిజర్వ్‌డ్ కేటగిరీ 40% మార్కులు) తీసుకొన్న విద్యార్థులు 10+2 పరీక్షలు
మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌తో పాసై ఉంటే వారికీ ఇంజనీరింగ్, టెక్నికల్
కోర్సుల్లో నేరుగా సెకండియర్‌లో చేరడానికి అర్హత ఉంటుందని పేర్కొంది.
అయితే రెండో సంవత్సరంలో చేరిన
బీఎస్సీ చేసిన విద్యార్థులు ఆ ఏడాది సబ్జెక్టులతోపాటు, తొలి
ఏడాదికి సంబంధించిన ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, ఇంజనీరింగ్
డ్రాయింగ్, ఇంజనీరింగ్ మెకానిక్స్ సబ్జెక్ట్‌లు పాస్
కావాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. డిప్లొమా విద్యార్థులతో సూపర్ న్యూమరరీ
పోస్టులు భర్తీచేసిన తర్వాతే బీఎస్సీ విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వాలని
పేర్కొంది. డిప్లొమా విద్యార్థులకు రెండో ఏడాది ఇంజనీరింగ్ కోర్సుల్లో
ప్రవేశానికి సంబంధించి ఏఐసీటీఈ జారీచేసిన ఈ నిబంధనలను అమలుచేసేలా అన్ని రాష్ట్ర
ప్రభుత్వాలు తమ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీలకు ఉత్తర్వులు జారీచేయాలని
సూచించింది.
0 Komentar