Disney to lay off about 28,000 employees due to
coronavirus' impact
డిస్నీ సంస్థలో 28 వేల మంది ఉద్యోగుల తొలగింపు
Not even Disney can live on dreams
కరోనా వైరస్ మహమ్మారి
ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలను అతలాకుతలం చేసింది. ఆర్థికంగా తీవ్రంగా
దెబ్బ తీసింది.
అమెరికా వ్యాపార దిగ్గజం డిస్నీ
సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాలో 28 వేల థీమ్ పార్క్
ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. ఈ మేరకు మంగళవారం డిస్నీ ఒక ప్రకటన విడుదల
చేసింది. చాలా భారమైన హృదయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. కరోనా వైరస్
మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలను అతలాకుతలం చేసింది. ఆర్థికంగా
తీవ్రంగా దెబ్బ తీసింది. ఈ సంక్షోభంతోనే డిస్నీ సంస్థలో భారీ ఉద్యోగాల కోతకు దారి
తీస్తోంది.
కరోనాతో వ్యాపారం పూర్తిగా తగ్గిపోవడంతో
థీమ్ పార్కులు, రిసార్ట్‌ల్లోని 28 వేల మంది
ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో 67
శాతం మంది తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారని డిస్నీ పార్క్స్ చైర్మెన్ జోష్ డీ అమారో
తెలిపారు. డిస్నీ థీమ్ పార్కులు, రిసార్టుల విభాగంలో అమెరికా
వ్యాప్తంగా సుమారు లక్షమంది ఉద్యోగులున్నారు.
గత కొన్ని నెలలుగా ఉద్యోగులు
ఎవరినీ తీయకుండా ఉండేందుకు మేనేజ్‌మెంట్ అవిరామంగా కృషి చేసింది, ఖర్చులు
తగ్గించుకున్నాం, కొన్ని కార్యక్రమాలను నిలిపివేశాం అయినా ఈ
దురదృష్టకర నిర్ణయం తీసుకోక తప్పలేదని పేర్కొన్నారు. ఫ్లోరిడా, పారిస్, షాంఘై, జపాన్ హాంకాంగ్‌లోని
డిస్నీ థీమ్ పార్కులు ఓపెన్ చేసినా లాభాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని సంస్థ
పేర్కొంది.
0 Komentar