Do you work sitting for 8 hours
a day?
రోజుకి 8 గంటలు కూర్చునే పని చేస్తున్నారా?
నేటి తరుణంలో ఎక్కడ చూసినా కూర్చుని చేసే జాబ్‌లు
ఎలా పెరిగిపోయాయో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు శారీరక శ్రమ ఉండే ఉద్యోగాలు
ఉండేవి. దీనికి తోడు మన పూర్వీకులు ఎక్కువగా చేతి వృత్తులు, వృత్తి పనులు చేసేవారు. అవి ఎంతో కొంత
శారీరక శ్రమను కలిగి ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. దాదాపుగా ఎక్కడ
చూసినా యంత్రాలు వచ్చేశాయి. దీంతో మనుషుల పని తేలికైంది. శారీరక శ్రమ తగ్గింది.
ఎక్కువగా కూర్చుని చేసే ఉద్యోగాలే సృష్టించబడుతున్నాయి. దీంతో వాటిలోనే ఎక్కువ
మంది సెటిల్ అవుతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఆ ఉద్యోగాల వల్ల మనకు మాత్రం
రోగాలే వస్తున్నాయి. అవి ఎంతలా అంటే.. చెప్పుకోలేనంతగా. అనేక రకాల సమస్యలు
ఈ తరహా ఉద్యోగాల వల్ల మనకు కలుగుతున్నాయి. ఈ క్రమంలోనే రోజుకు 8 గంటల కన్నా మించి ఎక్కువ సంవత్సరాల
పాటు ఉద్యోగం చేస్తే ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. వెన్నెముక
సాధారణంగా మన వెన్నెముక ఆంగ్ల ఎస్ అక్షరం
షేప్‌లో ఉంటుంది. కానీ అలా రోజూ ఎక్కవ సేపు కూర్చుని పనిచేస్తే 5 ఏళ్లకు మన వెన్నెముక ఆంగ్ల సి అక్షరం
షేప్ కు మారుతుంది. ఎక్కువ సేపు కూర్చుని ఉండడం వల్ల పొట్ట, ఛాతి దగ్గర ఉండే కండరాలు వీక్
అవుతాయి. దీంతో ఆ భాగంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. ఫలితంగా అది
వెన్నెముక షేప్ అవుట్ కు కారణమవుతుంది. దీంతోపాటు చూపులో తేడా వస్తుంది.
దృష్టి తగ్గుతుంది. తలనొప్పి ఎక్కువగా వస్తుంటుంది.
2. గుండె
కూర్చుని ఉద్యోగాలు చేసే చాలా మందికి గుండె జబ్బులు, హైబీపీ సమస్యలు వస్తున్నాయి.
ఎక్కువ సేపు కూర్చుని ఉండడం వల్ల శరీరంలో రక్త సరఫరా సరిగ్గా జరగదు.
దీంతో గుండె సంబంధ వ్యాధులు ఎక్కువగా వస్తాయి. ఈ క్రమంలో రక్త నాళాల్లో
కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. అది రక్త సరఫరాకు ఆటంకం కలిగిస్తుంది. దీంతో
హార్ట్ ఎటాక్‌లు వస్తాయి. శారీరక శ్రమ చేసే వారి కన్నా చేయకుండా, కూర్చుని పనిచేసేవారిలో గుండె జబ్బులు
వచ్చే అవకాశం 54 శాతం వరకు ఉంటుందని పరిశోధనలు
చెబుతున్నాయి.
3. వెరికోస్
వీన్స్
కాళ్లలో ఉండే రక్త నాళాల్లో రక్తం గడ్డుకుని
పోతుంది. దీంతో ఆయా ప్రదేశాల్లో రక్త నాళాల్లో రక్త సరఫరా సరిగ్గా జరగక
అక్కడ నాళాలు వాపులకు లోనవుతాయి. ఇది ఎక్కువైతే ఆ వాపులు బయటకు కనిపిస్తాయి.
దీన్నే వెరికోస్ వీన్స్ అంటారు. సాధారణంగా ఈ సమస్య కూడా ఎక్కువ సేపు కూర్చుని పని
చేసే వారికి వస్తుంది. ఇక కాళ్లను మడిచి లేదా ఒక దానిపై మరొకటి వేసుకుని
కుర్చీలో కూర్చునే వారికి ఈ సమస్య త్వరగా వస్తుంది. రక్త సరఫరా సరిగ్గా జరగకపోతేనే
ఈ సమస్య వస్తుంది.
4. స్థూలకాయం
ఇది చాలా మందికి వచ్చేదే. ప్రధానంగా కూర్చుని
ఉద్యోగం చేసే వారికి ఎక్కువగా వస్తుంది. శారీరక శ్రమ లేకపోవడం, ఏసీల్లో పనిచేయడం, ఆకలి వేయకున్నా ఏదో ఒకటి లాగించేయడం, అసమయ భోజనాలు, నిద్రలేమి.. వంటి కారణాలు తోడైతే
స్థూలకాయం సమస్య మరింత పెరుగుతుంది.
5. కండరాలు, ఎముకలు
నిత్యం కూర్చుని ఉద్యోగం చేసే వారిలో కండరాలు, ఎముకలు త్వరగా బలహీనంగా మారిపోతాయట.
దీంతో వారిలో ఆస్టియోపోరోసిస్ సమస్య త్వరగా వస్తుందట. అలా అని అధ్యయనాలే
చెబుతున్నాయి.
6. జీర్ణ
వ్యవస్థ
నిత్యం కూర్చుని పనిచేసే వారిలో రోజు రోజుకీ
జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మందగిస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు.
దీనికి తోడు కణాలు ఇన్సులిన్‌ను సరిగ్గా గ్రహించలేవు. దీంతో రక్తంలో గ్లూకోజ్
అధికంగా పేరుకుపోయి అది టైప్ 2 డయాబెటిస్‌కు
దారి తీస్తుంది.
7. వయస్సు
మీద పడడం
నిత్యం శారీరక శ్రమ చేసే వారి కన్నా చేయకండా
కూర్చుని పని చేసే వారిలో వృద్ధాప్య లక్షణాలు త్వరగా వస్తాయని పలు పరిశోధనలు
చెబుతున్నాయి. అలాంటి వారు త్వరగా వృద్ధాప్యంలోకి వచ్చేస్తారని సైంటిస్టులు
అంటున్నారు.
8. మానసిక
ఒత్తిడి
కూర్చుని ఉద్యోగాలు చేసే వారిలో చాలా మంది నిత్యం
పలు సందర్భాల్లో తీవ్రమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇది వారి మానసిక
ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దీంతో వారిలో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా
అది డిప్రెషన్‌కు దారి తీసి ప్రాణాల మీదకు తెచ్చి పెడుతుంది.
9. నిద్రలేమి
నిత్యం కూర్చుని ఉద్యోగాలు చేసే వారిలో కలిగే
మానసిక ఒత్తిడి వల్ల వారిలో నిద్రలేమి సమస్య వస్తుంది. త్వరగా నిద్రరాదు.
ఇది పలు ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
10. శృంగార
సామర్థ్యం
శారీరక శ్రమ చేయకుండా నిత్యం కూర్చుని ఉండే
వారిలో శృంగార సామర్థ్యం కూడా తగ్గిపోతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
వారిలో శృంగార కాంక్ష ఏమాత్రం ఉండదట. మానసిక ఒత్తిడి వల్ల ఆ కార్యంలో
పాల్గొనాలనే ఆసక్తి కూడా సన్నగిల్లిపోతుందని సైంటిస్టులు చెబుతున్నారు.
ఇలా చేయాలి…
నిత్యం కూర్చుని ఉండడం, ఉద్యోగాలు చేయడం వల్ల ముందు చెప్పిన అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయని
తెలుసుకున్నారు కదా. అయితే వాటి బారిన పడకుండా ఉండాలంటే రోజూ కింద చెప్పిన సూచనలు
పాటించాలి. అవేమిటంటే…
1. నిత్యం
కనీసం 30 నుంచి 60 నిమిషాల పాటు అయినా వ్యాయామం చేయాలి. యోగా, ధ్యానం తదితర వ్యాయామాలను
ప్రాక్టీస్ చేయాలి. ఇవి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. చక్కని ఆరోగ్యానికి
బాటలు వేస్తాయి.
2. ఆఫీసుల్లో
నిరంతరాయంగా కూర్చుని పనిచేయాల్సి వస్తే కనీసం గంటకు ఒకసారి అయినా లేచి 5 నిమిషాల పాటు బ్రేక్ తీసుకోండి.
కొద్దిగా అటు, ఇటు నడవండి. దీంతో స్ట్రెస్ బారిన పడకుండా
ఉండవచ్చు.
3. ఆఫీసుల్లో
ఇంటర్ కామ్ వల్ల పక్కనే ఉన్నా కొలీగ్‌తో ఫోన్‌లోనే మాట్లాడుతారు. అలా కాకుండా
నేరుగా కొలీగ్ వద్దకే వెళ్లండి. దీంతో కొంత అయినా శారీరక శ్రమ కలుగుతుంది.
4. ప్రజా
రవాణా ఉపయోగిస్తున్నప్పుడు బస్సుల్లో వీలైనంత వరకు నిలబడి ఉండే ప్రయత్నం
చేయండి. ఇది ఎంతో కొంత శారీరక శ్రమను ఇస్తుంది. అలాగే ఆఫీసుల్లో లిఫ్ట్‌కు బదులుగా
మెట్లనే ఉపయోగించండి.
5. మధ్యాహ్నం
భోజనం చేయగానే వెంటనే సీట్‌లో కూర్చుని పనికి దిగకుండా కొంత సేపు వాకింగ్
చేయండి.
6. ఆఫీసుల్లో
మీటింగ్స్ పెడితే నిలబడి ఉండడం అలవాటు చేసుకోండి.
7. నిత్యం
భోజనానికి కచ్చితమైన సమయాన్ని పాటించండి. జీర్ణ వ్యవస్థ సరిగ్గా
పనిచేస్తుంది.
8. రాత్రి
పూట బెడ్‌పై చేరగానే మొబైల్స్, ట్యాబ్లెట్
పీసీలు తదితర గ్యాడ్జెట్లకు దూరంగా ఉండండి.
ఈ సూచనలు పాటిస్తే నిత్యం కూర్చుని ఉండడం వల్ల
వచ్చే అనారోగ్యాల బారి నుంచి తప్పించుకోవచ్చు.
0 Komentar