Dream come true - A young man from Telangana flew in the air for
20 min
మూడేళ్ల కష్టం.. కల నిజం
చేసుకొని.. 20 నిమిషాలు గాల్లో ఎగిరిన తెలంగాణ యువకుడు
పారా గ్లైడర్ రూపొందించాలనే
పట్టుదలతో మూడేళ్లుగా అర్జున్ ప్రయత్నాలు చేశాడు. ఇందుకోసం అమెరికా, ఇటలీ
నుంచి ఏకంగా రూ.15 లక్షల విలువైన విడిభాగాలు
తెప్పించుకున్నాడు.
ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏదీ
లేదని తెలంగాణకు చెందిన మరో యువకుడు నిరూపించాడు. రామగుండానికి చెందిన ఇతను ఓ అద్భుత
ఘట్టాన్ని ఆవిష్కరించాడు. సొంతంగా పవర్ పారా గ్లైడర్ రూపొందించి ఏకంగా అందులో 20
నిమిషాల పాటు గాలిలో విన్యాసాలు చేశాడు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని రైల్వే
కాలనీకి చెందిన ఆడెపు అర్జున్ దీన్ని తయారు చేశాడు. బీకామ్ చదివిన తనకు
చిన్నప్పటి నుంచి పారా గ్లైడింగ్ అంటే ఇష్టమని, దానిపై
మక్కువతోనే దీన్ని తయారు చేసినట్లు వెల్లడించాడు.
పారా గ్లైడర్ రూపొందించాలనే
పట్టుదలతో మూడేళ్లుగా అర్జున్ ప్రయత్నాలు చేశాడు. ఇందుకోసం అమెరికా, ఇటలీ
నుంచి ఏకంగా రూ.15 లక్షల విలువైన విడిభాగాలు
తెప్పించుకున్నాడు. మూడేళ్లపాటు కష్టపడి దాన్ని తయారు చేశాడు. సోమవారం చేసిన
ట్రయల్ రన్‌లో భాగంగా 20 నిమిషాలు గాల్లోనే విన్యాసాలు
చేశాడు. హైదరాబాద్‌లో జరిగే అడ్వెంచర్స్ ఈవెంట్ల కోసం ఇతర రాష్ట్రాల నుంచి పార
గ్లైడర్లను పిలిపించే ప్రభుత్వం, ఈసారి తమలాంటి యువతకు కూడా
అవకాశం ఇవ్వాలని కోరాడు.
సలహాలు, సూచనలు
ఇలా..
పారా గ్లైడర్ తయారు చేయడంలో
భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లోని తన స్నేహితులతో కలిసి విన్యాసాలలో నైపుణ్యం
పెంచుకున్నాడు. విశ్రాంత ఆర్మీ అధికారులు పైలెట్, పారా గ్లైడర్‌లు
ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో తాను కూడా చేరి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు పొందేవాడు. మూడేళ్ల నుంచి దీని కోసం శ్రమపడి ఎట్టకేలకు విజయం
సాధించాడు. సోమవారం రామగుండం జెన్కో క్రీడా మైదానంలో 20
నిమిషాల పాటు ట్రైలర్ రన్ నిర్వహించి అందరినీ అబ్బుర పరిచాడు.
పారా గ్లైడింగ్.. అనేది ఓ సాహస
క్రీడ. మనిషి పక్షిలా ఎగరాలనుకుంటే దీన్ని ప్రయత్నించవచ్చు. సాధారణంగా బీచుల్లో
పారా గ్లైడింగ్‌లు కనిపిస్తుంటాయి. హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్
రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుంది. దానిపై ఆసక్తితో తెలంగాణ యువకుడు ఈ గ్లైడర్‌ను
తయారు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
0 Komentar