పెరుగు లేదా దధి ఒక మంచి ఆహార పదార్ధము. మరిగించిన పాల లో గోరువెచ్చగా ఉండగా మజ్జిగ చుక్కలను వేస్తే పాలు గట్టిగా తోడుకొంటాయి. దీనినే పెరుగు అంటారు. పెరుగు నుండి వెన్న, నెయ్యి, మీగడలను తీస్తారు. పాలలో తోడు తక్కువ వేస్తే పెరుగు తియ్యగా ఉంటుంది. తోడు ఎక్కువైతే పెరుగు పుల్లగా ఉంటుంది. పెరుగు ఎలాంటి వాత వ్యాధినయినా జయిస్తుంది. ఇది బరువును పెంచుతుంది, శరీరానికి పుష్టిని కలిగిస్తుంది.
ఆహారం మీద యిష్టం లేని వాళ్ళకి పెరుగు మంచిదని ఆయుర్వేదం చెబుతుంది. అయితే పాలను తోడు వేసి తయారు చేసే పెరుగంటే చాలా మందికి ఇష్టమే. కొందరైతే భోజనం చివర్లో పెరుగుతో తినంది అస్సలు సంతృప్తి చెందరు. భోజనం అసంపూర్తిగా ముగిసినట్టుగానే భావిస్తారు. అయితే దీని మాట ఎలా ఉన్నా పెరుగుతో మనకు అనేక రకాల లాభాలే ఉన్నాయి. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో పెరుగుతో కలిపి పలు ఆహార పదార్థాలను తింటే పలు రకాల అనారోగ్య సమస్యలను సులభంగా దూరం చేసుకోవచ్చు. ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కొద్దిగా జీలకర్రను
తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తింటే త్వరగా బరువు తగ్గుతారు.
2. కొద్దిగా నల్ల ఉప్పును
తీసుకుని బాగా పొడి చేయాలి. దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తాగాలి. దీంతో
జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. ప్రధానంగా గ్యాస్, అసిడిటీ
వంటివి తగ్గుతాయి.
3. కొద్దిగా పెరుగులో చక్కెర
కలుపుకుని తినాలి. దీంతో శరీరానికి వెంటనే శక్తి అందుతుంది. మూత్రాశయ సంబంధ సమస్యలు
కూడా పోతాయి.
4. కొంత వాము తీసుకుని ఓ కప్పు
పెరుగులో కలిపి తినాలి. దీని వల్ల నోటి పూత, దంతాల నొప్పి,
ఇతర దంత సంబంధ సమస్యలు పోతాయి.
5. ఓ కప్పు పెరుగులో కొంత
నల్ల మిరియాల పొడిని కలిపి తినాలి. దీని వల్ల మలబద్దకం దూరమవుతుంది. తిన్న
ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
6. పెరుగులో కొన్ని ఓట్స్ కలిపి
తినాలి. ఇలా చేయడం వల్ల మంచి ప్రోబయోటిక్స్, ప్రోటీన్లు
లభిస్తాయి. ఇవి కండరాల పుష్టికి దోహదం చేస్తాయి.
7. పెరుగులో వివిధ రకాల
పండ్లను కలిపి తింటే శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. పలు రకాల
ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
8. పెరుగులో కొంత పసుపు,
కొంత అల్లం కలిపి తినాలి. దీని వల్ల ఫోలిక్ యాసిడ్ శరరీంలోకి
చేరుతుంది. ఇది చిన్నారులకు, గర్భిణీ మహిళలకు ఎంతగానో
మేలు చేస్తుంది.
9. పెరుగులో ఆరెంజ్ జ్యూస్
కలిపి తింటే శరీరానికి తగినంత విటమిన్ సి లభిస్తుంది. ఇది కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.
వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది.
10. పెరుగులో తేనె కలిపి
తీసుకుంటే కడుపులో ఉన్న అల్సర్లు మటుమాయమైపోతాయి. ఈ మిశ్రమం యాంటీ బయోటిక్‌గా పనిచేస్తుంది.
దీని వల్ల శరీరంలో ఉన్న ఇన్‌ఫెక్షన్లు వెంటనే తగ్గుతాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల
ప్రకారం ఈ వివరాలను అందించాం.
0 Komentar