నిద్రలేమితో బాధపడుతున్నారా? అయితే, మీరు తప్పకుండా ఈ పండు తినాల్సిందే. ఇంతకీ ఆ పండు ఏమిటో తెలుసా? మీ అందిరికీ తెలిసిందే.. కానీ, చాలా తక్కువగా తినే పండు. అరుదుగా లభించే పండు. అదేనండి.. కివీ పండు.
కివీ పండు సాధారణ పండు కాదు. ఏ
పండ్లలో లేనన్ని పోషకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. కివీ పండుతో రక్తంలోని ప్లేట్‌లెట్ల
సంఖ్య పెరుగుతుంది. ఈ పండులో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ రోగనిరోధక
శక్తిని పెంచుతాయి. ఈ పండు పలు అనారోగ్యాలకు కూడా సూపర్ మెడిసిన్‌గా పనిచేస్తుంది.
మధుమేహం,
గుండె జబ్బులు, నిద్రలేమితో బాధపడేవారికి కివీ
పండు దివ్యౌషదంగా పనిచేస్తుంది. ఈ పండు వల్ల ఇంకా ఏయే ప్రయోజనాలు శరీరానికి
అందుతాయో చూడండి.
కివీ పండు ఉపయోగాలు ఇవే
✺ కివీలో నారింజ, నిమ్మలో
కంటే అత్యధికంగా విటమిన్-C ఉంటుంది.
✺ కివీ పండు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా
పనిచేస్తుంది. ఫలితంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
✺ నిద్రలేమితో బాధపడుతున్న ఇది మంచి ఔషధం.
✺ కివీలో ఉండే సెరోటొనిన్ నిద్రలేమిని
పోగొడుతుంది.
✺ పడుకోడానికి గంట ముందు రెండు కివీ పళ్లు
తింటే హాయిగా నిద్రపడుతుంది.
✺ ఈ పండు గుండెకు కూడా చాలా మంచిది.
✺ రక్తపోటు నియంత్రణలో కివీ పండ్లు బాగా
పనిచేస్తాయి.
✺ గర్భిణీలు కివీ పండ్లు తింటే బిడ్డ
ఎదుగుదలకు తోడ్పడుతుంది.
✺ రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించే గుణం
కివీకి ఉంది. ఇది మధుమేహం ఉన్న వారికి మేలు చేస్తుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల
ప్రకారం ఈ వివరాలను అందించాం.
0 Komentar