EducationUSA presents U.S. University
Virtual Fair, 2020
100 American Universities on the Online Platform
ఆన్ లైన్ వేదికపైకి 100 అమెరికా విశ్వవిద్యాలయాలు
అమెరికాలోని వంద ప్రభుత్వామోదిత
విశ్వవిద్యాలయాలు ఒకే వేదిక పైకి రానున్నాయి. డిగ్రీ నుంచి పీహెచ్ డి ల్లో
ప్రవేశాలకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు ఆయా విశ్వవిద్యాలయాలు నాలుగు రోజులపాటు
అందుబాటులో ఉంటాయని హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ శుక్రవారం ఒక ప్రకటనలో
పేర్కొంది. కరోనా కారణంగా నేరుగా ఆయా విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో వర్చువల్
విధానంలో చర్చించేందుకు వెసులుబాటు
కల్పిస్తున్నట్లు తెలిపింది. మాస్టర్స్, పీహెచ్డీ విద్యార్థుల కోసం
వచ్చే నెల రెండు, మూడు తేదీల్లో, డిగ్రీలో
చేరే విద్యార్థుల కోసం వచ్చే నెల తొమ్మిది, పది తేదీల్లో
వీటిని నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొ నాలనుకునే వారు ముందస్తుగా ఆన్‌లైన్‌లో
నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మాస్టర్స్, పీహెచ్డీ
విద్యార్థులు ONLINE
LINK లో, డిగ్రీలో చేరే విద్యార్థులు ONLINE
LINK లో నమోదు చేసుకోవాలి. సంబంధిత వివరాలను ఆయా
విశ్వవిద్యాలయాల ప్రతినిధులు, కౌన్సిలర్ల ద్వారా
తెలుసుకోవచ్చు.
0 Komentar