Entrance Exam for IIIT Admissions 2020-21
ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు పరీక్ష - ఆర్జీయూకేటీ నిర్ణయం
రాజీవ్ గాందీ యూనివర్సిటీ ఆఫ్
నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధి లోని ట్రిపుల్ ఐటీ సంస్థల్లో 2020-21 విద్యాసంవత్సరపు ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నారు. బుధవారం
ఆర్జీయూకేటీ పాలకవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ మంత్రి డాక్టర్
ఆదిమూలపు సురేష్, ఆర్జీయూకేటీ చాన్సలర్ ప్రొఫెసర్ కేసీరెడ్డి,
ఇన్చార్జ్ వైస్ చా న్తర్, ఉన్నత విద్యా మండలి
చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక
ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, విద్యారంగ సంస్కరణల కమిటీ
చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణన్, మండలి కార్యదర్శి ప్రొఫెసర్
సుధీర్
ప్రేమ్ కుమార్ ఈ సమావేశంలో
పాల్గొన్నారు.
- ఆర్జీయూకేటీ పరిధిలో నూజివీడు, ఇడుపులపాయ,
ఒంగోలు, శ్రీకాకుళంలలో ట్రిపుల్ ఐటీలు
కొనసాగుతున్నాయి. ఈ విద్యాసంస్థల్లోని కోర్సులకు పదో తరగతి పరీక్షల్లో మెరిట్లోఉన్న
విద్యార్థులను రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు. ఈసారి కోవిడ్-19 నేపథ్యంలో
పదో తరగతి పరీక్షలు రద్దు అవడంతో ప్రభుత్వం విద్యార్థులందరినీ ఆల్ పాస్ గా
ప్రకటించింది. దీంతో మెరిట్ ప్రకారం నిర్ణయించేందుకు వీలు లేకుండా పోయింది..
- ఆర్జీయూకేటీ పాలకవర్గం సమావేశమై
ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించింది. మూడు గంటల వ్యవధి ఉండేలా ఆన్లైన్లో
ఓఎమ్మార్ షీట్లతో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.
- ప్రభుత్వం నుంచి
ఉత్తర్వులు రాగానే ప్రవేశ పరీక్ష విధివిధానాలు రూపొందించి షెడ్యూలను ప్రకటిస్తారు.
Hii you
ReplyDelete