Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Entrance exams start from 10th of this month in AP: Minister Suresh


Entrance exams start from Sep 10th in AP
ఏపీలో ఈనెల 10 నుంచి ప్రవేశ పరీక్షలు ప్రారంభం  - ఏర్పాట్లు పూర్తి..!
ప్రవేశ పరీక్షల (సెట్స్‌) నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మీడియాతో మాట్లాడిన మంత్రి.. ఈ నెల 10 నుంచి వివిధ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అన్నీ ప్రవేశ పరీక్షలు కలిపి మొత్తం ఏడు కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
ఈ క్రమంలో ఎంసెట్‌కు సుమారు 2,72,720 మంది నమోదు చేసుకున్నారని మంత్రి తెలిపారు. పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఏపీ ఎంసెట్ పరీక్షను 118 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.

హెల్ప్‌లైన్‌ ఏర్పాటు:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తాం. పరీక్ష ప్రారంభానికి ముందు.. పరీక్ష అనంతరం కూడా హాల్‌ను శానిటైజ్ చేస్తాం. ప్రతి సెంటర్‌లో ఇసోలేషన్ రూమ్‌లు అందుబాటులో ఉంచాం. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

టీసీఎస్, ఏపీ ఆన్‌లైన్ సంయుక్తంగా ఆన్‌లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తాం. విద్యార్థులకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నాం. హాల్ టికెట్‌తో పాటు పరీక్ష సెంటర్ రోడ్డు మ్యాప్ కూడా అందిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ పేర్కొన్నారు.

కరోనా కారణంగా వాయిదా పడిన ప్రవేశ పరీక్షలను.. సెప్టెంబర్‌ 17 నుంచి 25 వరకూ ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇ‍క సెప్టెంబర్‌ 10,11 తేదీల్లో ఐసెట్‌, 14న ఈసెట్‌, 28,29,30 తేదీల్లో ఏపీ పీఈసెట్‌, అక్టోబర్‌ 1న ఎడ్‌సెట్‌, 2వ తేదీన లాసెట్‌ నిర్వహించనుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags