EPFO decides to credit 8.15% interest now
on EPF for FY20
2019-20 కి గాను తొలుత EPF
పై 8.15% వడ్డీని క్రెడిట్ చేయాలని EPFO
నిర్ణయించింది
వేతన జీవుల ఈపీఎఫ్ ఖాతాల్లో 2019-20 సంవత్సరానికి 8.5 శాతం వడ్డీ జమ చేసేందుకు ఉద్యోగుల
భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్) నిర్ణయించింది. అయితే, తొలుత 8.15 శాతం చెల్లించి, మిగిలిన 0.35
శాతం డిసెంబర్ లో చెల్లించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బుధవారం జరిగిన
ట్రస్టీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మొత్తం 6 కోట్ల చందాదారుల ఖాతాల్లో ఈ మొత్తం జమ చేయనున్నారు.
నిధుల కొరతను అధిగమించేందుకు
స్టాకా మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాలన్న నిర్ణయాన్ని ఈ సమావేశంలో
ఉపసంహరించుకున్నారు. కొవిడ్-19 కారణంగా మార్కెట్లు ఒడుదొడుకులకు
లోనవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే వడ్డీ జమ ఆలస్యం
అంశాన్ని కొందరు ట్రస్టీలు ఈ సమావేశంలో లేవనెత్తారు. కాగా, 2019-2020 ఆర్థిక సంవత్సరానికి భవిష్య నిధి మొత్తాలపై 8.5 శాతం
వడ్డీ ఇవ్వాలని మార్చిలో జరిగిన ట్రస్టీల సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. 0.35
శాతం వడ్డీని జమ చేసే అంశంపై డిసెంబర్ లో మరోసారి బోర్డు సమావేశం
కానుంది.
0 Komentar