Exam room details on hall
ticket - JEE (Advanced) 2020
‘జేఈఈ’ హాల్‌టిక్కెట్‌పైనే
పరీక్ష గది వివరాలు
పరీక్ష కేంద్రం చిరునామా తెలిసినా, అక్కడికి వెళ్లి పరీక్ష గది ఎక్కడుందో
తెలుసుకోవడానికి బయట బోర్డు వద్ద విద్యార్థులు గుమిగూడటం సర్వసాధారణం. కరోనా
నేపథ్యంలో గుమిగూడటాన్ని నిరోధించేందుకు సెప్టెంబరు 27వ
తేదీన జరగనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కొత్త విధానాన్ని అమలు చేయబోతున్నారు.
విద్యార్థుల హాల్‌టికెట్‌లోనే పరీక్ష కేంద్రంలో ఏ గది/ల్యాబ్‌లో సీటు
కేటాయించారోనన్న వివరాలు పొందుపరిచారు. కాకపోతే హాల్‌టిక్కెట్‌పై ఉన్న బార్‌కోడ్‌ను
స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రంలోకి నేరుగా వెళ్లిన తర్వాత సిబ్బంది
హాల్‌టిక్కెట్(అడ్మిట్ కార్డు)ను స్కానింగ్ చేసి మీకు కేటాయించిన కంప్యూటర్ ఏ
ల్యాబ్‌లో ఉందో చెబుతార.
కొన్ని వివరాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి👇
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్:
సెప్టెంబర్ 21, 2020 నుంచి సెప్టెంబర్ 27, 2020
అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీ:
సెప్టెంబర్ 27, 2020 (పేపర్-1: ఉదయం 9 నుంచి 12 గంటల వరకు; పేపర్-2:
మధ్యాహ్నం 2:30-5:30)
పరీక్ష ఫలితాల వెల్లడి: అక్టోబర్ 5, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://jeeadv.ac.in/
0 Komentar