Fighting for the abolition of CPS
సీపీఎస్ రద్దుకు పోరుబాట
కంట్రిబ్యూటరీ పింఛను విధానం
(సీపీఎస్) రద్దు కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పోరుబాట బట్టాయి. పాత
పింఛను విధానాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ఐకాస, ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్, సీపీఎస్
ఉద్యోగుల సంఘం మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరుగా ఆందోళనలు నిర్వహించాయి.
సీపీఎస్ అమల్లోకి వచ్చిన సెప్టెంబరు 1ని పురస్కరించుకుని
ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. మరికొందరు కార్యాలయాల్లో
మధ్యాహ్నం నిరసనలు తెలిపారు. కొందరు ఉద్యోగులు కుటుంబీకులతో కలిసి నివాసాల్లో
ప్లకార్డులతో నిరసన దీక్ష చేపట్టారు. అధికారంలోకొచ్చిన వారంలోనే సీపీఎస్‌ను రద్దు
చేస్తామన్న హామీని సీఎం జగన్ అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ఐకాస ప్రభుత్వ
కార్యాలయాల్లో మధ్యాహ్నం చేపట్టిన నిరసనల్లో ఐకాస ఛైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి,
ఏపీఎన్జీవో సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్) సత్యాగ్రహం నిర్వహించింది. ఏపీసీపీఎస్ ఉద్యోగుల
సంఘం ‘సీపీఎస్ ఉద్యోగుల ఆవేదన’ పేరుతో విజయవాడలో చేపట్టాలనుకున్న నిరసనలకు
పోలీసులు అడ్డుకున్నారు.
0 Komentar