Finance Ministry relief for those who
choose loan moratorium!
The exception to that?
లోన్ మారటోరియం ఎంచుకున్న వారికి
ఆర్థిక శాఖ ఊరట! అందుకు మినహాయింపు?
లోన్ మారటోరియం బెనిఫిట్ పొందారా? అయితే
మీరు వడ్డీ మీద వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది సమంజసం కాదని కొందరు
సుప్రీం కోర్టుకు వెళ్లారు. దీంతో ఆర్థిక శాఖ ఈ అంశంపై కమిటీని ఏర్పాటు చేసింది.
కరోనా వైరస్ కారణంగా దేశ ఆర్థిక
వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడింది. చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఉద్యోగుల
వేతనాల్లో కోత పడింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా
(RBI)
రుణ గ్రహీతలకు ఊటర కలిగే నిర్ణయం తీసుకుంది. లోన్ మారటోరియం
ప్రయోజనాన్ని కల్పించింది.
ఈఎంఐ కట్టడం కష్టంగా ఉన్న వారు
లోన్ మారటోరియం ఫెసిలిటీ పొందారు. లోన్ మారటోరియంపై బ్యాంకులు వడ్డీ వసూలు చేస్తున్నాయి.
ఇలా చేయడం సరికాదని కొందరు సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఈ అంశంపై కోర్టు ఇంకా తుది
తీర్పును వెల్లడించలేదు. వడ్డీ అంశంపై కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ
నిర్ణయం తెలియజేయాలని కోరింది.
ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ ఒక కమిటీని
ఏర్పాటు చేసింది. మారటోరియం రుణాలపై వడ్డీ వసూలు చేయకుండా ఉంటే ఎలాంటి ప్రభావం
పడుతుందో ఈ కమిటీ ఆర్థిక శాఖకు నివేదిస్తుంది. ఈ కమిటీ రుణ గ్రహీతలకు ఊరట కలిగే
నిర్ణయం తీసుకోనుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంపౌండ్ వడ్డీ (వడ్డీ
మీద కట్టే వడ్డీ నుంచి) నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశముంది.
లోన్ మారటోరియం రుణాలకు కల్పించే
సడలింపుల వల్ బ్యాంకులపై లేదా బ్యాంక్ ఖాతాదారులపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ఈ
కమిటీ అభిప్రాయపడుతోంది. కాంపౌండిగ్ వడ్డీ నుంచి కొంత మంది రుణ గ్రహీతలకు ఊరట
కలిగించే నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. అలాగే ఈ ప్రయోజనాన్ని పరిమితంగా
ఉంచాలని యోచిస్తోంది.
అయితే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా
(RBI)
మాత్రం లోన్ మారటోరియం బెనిఫిట్ పొందిన వారికి వడ్డీ మినహాయింపు
కల్పించాలనే అంశంపై సుముఖంగా లేదు. దీని వల్ల బ్యాంకింగ్ వ్యవస్థపై తీవ్ర ప్రతికూల
ప్రభావం పడుతుందని పేర్కొంటోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్‌బీఐ నిర్ణయాన్ని
సమర్థించింది. అయితే సుప్రీం కోర్టు మాత్రం మీ సొంత నిర్ణయం తెలియజేయాలని కోరింది.
దీంతో ఆర్థిక శాఖ మహర్షి కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీం కోర్టు సెప్టెంబర్ 28న మళ్లీ లోన్ మారటోరియం అంశంపై విచారణ జరుపనుంది.
0 Komentar