Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

‘Five Points’ for resolving the stalemate on the Indo-China border



‘Five Points’ for resolving the stalemate on the Indo-China border
భారత్-చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంభన పరిష్కారానికి ‘పంచ సూత్రాలు’
సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించడానికి ఉద్దేశించిన ఒప్పందాలను చైనా ఎన్నడూ గౌరవించలేదని, ఇంత సుదీర్ఘ సైనిక ప్రతిష్టంభన రెండు దేశాలకూ మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సరిహద్దుల్లో భారత్-చైనాల మధ్య నాలుగు నెలలు నుంచి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తూర్పు లడఖ్‌లో ఏర్పడిన ప్రతిష్టంభనను నివారించడానికి భారత్‌, చైనాలు ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. సరిహద్దుల్లో భారీగా మోహరించిన బలగాలను వేగంగా మళ్లించాలని, ఉద్రిక్తతలను పెంచే చర్యలకు దూరంగా ఉండాలని, వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి ప్రశాంతతను నెలకొల్పాలని ఇరు దేశాలూ నిర్ణయించాయి. సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం వల్ల ఏ దేశానికీ ప్రయోజనం చేకూరదనే అభిప్రాయానికి ఇరు పక్షాలు వచ్చాయి.

తాజా ఒప్పందంలోని కొన్నింటిని అమలు చేసే విషయమై అక్టోబరు తొలివారంలో భారత్-చైనాల మధ్య కోర్‌ కమాండర్ల స్థాయి చర్చలు జరిగే అవకాశం ఉంది. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సమావేశం అనంతరం గురువారం మాస్కోలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జయ్‌శంకర్‌, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ మధ్య గురువారం రాత్రి చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఇవి నిర్మాణాత్మకంగా, నిర్మొహమాటంగా జరిగాయని వెల్లడించిన అధికార వర్గాలు.. పంచ సూత్ర ప్రణాళికపై ఇరు దేశాలూ అంగీకారానికి వచ్చాయని తెలిపాయి. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించే విషయంలో ఇరు దేశాలకు ఇవి మార్గదర్శకంగా ఉంటాయని పేర్కొన్నాయి.

అంగీకరించిన పంచ సూత్రాలివీ...
1. భారత్, చైనాల మధ్య ఉన్న విభేదాలు వివాదాలుగా మారకుండా చూడటం సహా ద్వైపాక్షిక సంబంధాల వృద్ధిపై ఇరు దేశాల అగ్రనాయకత్వం మధ్య కుదిరిన ఏకాభిప్రాయాల నుంచి స్ఫూర్తి పొందాలి.
 2. ప్రస్తుత పరిస్థితి ఏ దేశానికి ప్రయోజనకారి కాదు. బరు దేశాల బలగాలు చర్చలను కొనసాగించాలి. వేగంగా సైనిక ఉపసంహరణ జరగాలి. ఇరు దేశాల బలగాల మధ్య నిర్దేశిత దూరం ఉండాలి.
3. సరిహద్దు ఒప్పందాలు, మార్గదర్శకాలకు ఐదు పక్షాలూ కట్టుబడాలి. శాంతిని పరిరక్షించాలి. ఉద్రిక్త తలను పెంచే ఎలాంటి చర్యలకూ దిగరాదు.
సరిహద్దు అంశంపై ప్రత్యేక ప్రతినిధితో కూడిన యంత్రాంగం ద్వారా చర్చలు కొనసాగించాలి. 4. భారత్ చైనా సరిహద్దు వ్యవహారాలపై ఏర్పడ్డ సంప్ర దింపులు, సమన్వయ కార్యాచరణ యంత్రాంగం (డబ్ల్యూఎంసీసీ) సమావేశాలను కొనసాగించాలి.
5. ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టేకొద్దీ రెండు పక్షాలు వేగంగా కసరత్తు సాగింది. కొత్తగా విశ్వాసం పాదు గొల్వే చర్యలను ఖరారు చేయాలి.

Previous
Next Post »
0 Komentar

Google Tags