Foot
problems and tips for care
పాదాల సమస్యలు మరియు సంరక్షణకు చిట్కాలు
సాధారణంగా
ముఖం, చర్మం, జుట్టు మరియు చేతులను జాగ్రత్తగా చూసుకోవడం మనలో చాలామందికి అలవాటు. శరీర సంరక్షణ ప్రాధాన్యతల
జాబితాలో పాదాల సంరక్షణకు తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పాదాలను సంరక్షణ చేయకపోవడం వలన
బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లు, పగిలిన చర్మం మరియు దుర్వాసన వంటి బాధాకరమైన
పరిణామాలు ఉంటాయి. మడమలు పగుళ్లు
ఇబ్బందికరంగా ఉండటమే కాకుండా బాధను కలిగిస్తాయి. పగుళ్లు ఉన్న మడమలతో నడక చాలా కష్టం అని మీకు తెలుసు. పాదాలలో పగుళ్లు
ఏర్పడడానికికారణం పాదాలు చర్మంలో సరిపడ తేమలేక పోవడం, సరికాని ఆహారం మరియు సరికాని
పాదరక్షలు ధరించడం వల్ల కావచ్చు. మీ మడమలు పగులడానికి ముందే జాగ్రత్తలు తీసుకోవడం లేదంటే
చివరికి నొప్పి మరియు రక్తస్రావం కావడానికి కారణం కావచ్చు. పగుళ్లును, అలెర్జీలను నివారించడానికి ఇంటివద్దే కొన్ని చిట్కాలను పాటించడం మేలు. శీతాకాలంలో, ముఖ్యంగా చర్మం, పగిలిపోయి, ఎండిపోయినప్పుడు,
మీ పాదాలను సంరక్షించుకోవడం ముఖ్యం. మీ పాదాల
వాపు లేదా చర్మం పై చికాకు కలగడం, వంటివి తీవ్రమైన చర్మ అలెర్జీ కావచ్చు అందుకు తక్షణ
వైద్య సహాయం అవసరం కావచ్చు కాబట్టి వైద్యుడిని సంప్రదించండి.
మీరు
పాటించవలసిన 7 పాదాల సంరక్షణ పద్ధతులు ఇవే..
1. కాలి మధ్య చర్మం సరిగా కడిగి శుభ్రపరచకపోతే
బాక్టీరియా మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్లు వృద్ధి చెందుతాయి. కాబట్టి ప్రతిరోజూ ఒకసారి సబ్బుతో
మీ పాదాలను కడగడం చాలా ముఖ్యం.
2. పాదాలు కడిగిన తర్వాత పాదాలను ఆరబెట్టడండం,
ముఖ్యంగా కాలి వేళ్ళ మధ్య ఉన్న ప్రాంతం ఆరబెట్టడంచాలా అవసరం.
3. మీ పాదాలను కడిగి ఆరబెట్టిన తర్వాత ప్రతిరోజూ
మాయిశ్చరైజర్స్ ను ఉపయోగించడం అవసరం. వాటిలో కోకో బటర్ లేదా పెట్రోలియం జెల్లీ వంటివి
వాడడం వల్ల చర్మానికి తేమ అందుతుంది.
4. ఎక్కువగా పొడిబారిన చర్మ పొరను తొలగించడం
కోసం చక్కెర మరియు ఆలివ్ నూనె మిశ్రమంతో స్క్రబ్బింగ్ చేయవచ్చు, వాటికి యాంటీ బాక్టీరియల్
లక్షణాల కోసం కొన్ని చుక్కల పుదీనా లేదా టీ ట్రీ ఆయిల్ కలుపుతారు.
5. వెచ్చని నీటిలో రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్
సోడా జోడించి, మీ పాదాలను 15-20 నిమిషాలు ఆ నీటిలో నానబెట్టండి. ఇది చర్మాన్ని మృదువుగా
చేయడానికి సహాయపడుతుంది. తరువాత పాదాలను తేలికగా రుద్దండి, వాటిని పూర్తిగా ఆరబెట్టి,
విటమిన్-ఇ రిచ్ కోల్డ్ క్రీమ్ రాయండి.
6. నిమ్మరసంతో కలిపిన మెత్తని అరటిని హైడ్రేటింగ్
మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీన్ని మీ పాదాలకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని
నీటితో కడగాలి.
7. చర్మ ఆరోగ్యం కోసం నీరు పుష్కలంగా త్రాగటం
చాలా ముఖ్యం.
8. బయటకు వెళ్ళే ముందు మరియు మీరు నిద్రపోయేటప్పుడు
మాయిశ్చరైజింగ్ ఫుట్ క్రీమ్ లేదా పెట్రోలియం జెల్లీని పాదాలకు రాయండి.
9. ఒక బకెట్ వెచ్చని నీటిలో ఒక కప్పు ముడి తేనె
జోడించండి. మీ పాదాలను ఆ నీటిలో నానబెట్టండి. ప్రతిరోజూ 10 - 15 నిముషాల పాటు రిపీట్
చేయండి.
10. మీ పాదాలకు ఇన్ఫెక్షన్లు మరియు మంటలు వచ్చే
అవకాశం ఉంటే, యాంటీ బాక్టీరియల్ క్రీమ్ వాడండి.
0 Komentar