Free images in Google search..how?
గూగుల్ సెర్చ్‌లో..ఫ్రీ ఇమేజస్..ఎలా
అంటే
రోజులో చాలా మంది సమాచారం కోసం
గూగుల్ సెర్చ్‌ను ఆశ్రయిస్తుంటారు. పనిలో పనిగా గూగుల్ ఇమేజస్‌లో నచ్చిన ఫొటోను
కూడా డౌన్‌లోడ్ చేస్తుంటాం. వాటిలో చాలా వరకు ఉచితంగా వాడుకునేవి అయితే
కొన్నింటికి కాపీరైట్ ఉంటుంది. అంటే ఆ ఫొటోను వాడేప్పుడు దాన్ని తీసిన వ్యక్తి
పేరును ప్రస్తావించాలి లేదా ఫొటోకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అలా
చేయకపోతే కాపీరైట్ అతిక్రమణ కింద మనపై కేసు నమోదుచేస్తారు. ఇది తరచుగా గూగుల్
ఫొటోస్‌పై ఆధారపడే వారికి పెద్ద సమస్య. ఇలాంటి కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఏయే
ఫొటోలకు కాపీరైట్ ఉందో మనకు తెలిస్తే సరిపోతుంది. దాని వల్ల మనం వాటి జోలికి
పోకుండా ఉచితంగా వాడుకోగలిగిన ఫొటోలను మాత్రమే ఎంచుకుంటాం. మరి కాపీరైట్/లైసెన్స్
ఫ్రీ ఇమేజెస్‌ని కనుక్కోవడం ఎలాగంటే...
► ముందుగా
మనకు కావాల్సిన ఫొటోను గూగుల్ సెర్చ్‌లో వెతకాలి. తర్వాత సెర్చ్ బార్ కింద ఉన్న
ఇమేజస్‌పై క్లిక్ చేయాలి.
► అది
ఓపెన్ అయ్యాక పక్కనే ఉన్న టూల్స్‌పై క్లిక్‌చేస్తే యూసేజ్ రైట్స్ (Usage
Rights) అనే ఆప్షన్ కనిపిస్తుంది.
► అందులోకి
వెళితే ఆల్, క్రియేటివ్ కామన్స్ లైసెన్స్, కమర్షియల్, అథర్ లైసెన్స్ అనే ఆప్షన్లు
కనిపిస్తాయి.
ఇలా మనకు కావాల్సిన ఫొటోలను ఎలాంటి
సమస్య లేకుండా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలానే కాపీరైట్ ఫ్రీ ఇమేజస్ కోసం పిక్సాబే
(Pixabay)
లాంటి వెబ్‌సైట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
0 Komentar