Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Google removes 17 apps from Play Store that intend to gain user data access



Google removes 17 apps from Play Store that intend to gain user data access
17 యాప్ లను తొలగించిన గూగుల్ ప్లేస్టోర్ -  వ్యక్తిగత సమాచారం సేకరిస్తుండటంతో వేటు
గూగుల్ ప్లేస్టోర్ 17 ఆండ్రాయిడ్ యాప్లను తన ప్లాట్ ఫామ్ నుంచి తొలగించింది. వీటిలో జోకర్ అనే మాల్వేర్ ఉంది. కాలిఫోర్నియాలోని Zscaler అనే ఐటీ సెక్యూరిటీ కంపెనీలోని పరిశోధకులు దీన్ని గుర్తించారు. దీంతో గూగుల్ యాలపై వేటు వేసింది. వినియోగదారులు ఈ యాప్ లో రిజిస్టర్ చేసుకున్నప్పుడు స్పైవేర్ సహాయంతో వారి మెసేజ్ లు, కాంటాక్ట్ లిస్ట్. డివైజ్ సమాచారం సేకరిస్తున్నాయని zscalerలోని ఐటీ సెక్యూరిటీ పరిశోధకుడు విరాల్ గాంధీ తెలిపారు. ఈ 17 ఆండ్రాయిడ్ యాప్లు అనధికారికంగా వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయని గూగుల్ గుర్తించగానే తక్షణమే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ టీం వీటిని తొలగించింది. ఈ యాప్ లను ఇప్పటికే 1,20,000 మంది ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లు Zscaler తన బ్లాగ్ లో తెలిపింది.

 ప్లేస్టోర్ నుంచి తొలగించిన యాప్ లు👇
-'ఆల్ గుడ్ పీడీఎఫ్ స్కానర్ (All Good PDF Scanner)
 '-మింట్ లీఫ్ మెసేజ్- యువర్ ప్రైవేట్ మెసేజ్ (Mint Leaf Message-Your Private Message)
-యూనిక్ కీబోర్డు- ఫాన్సీ ఫాంట్స్ & ఫ్రీ ఈమోటీకాన్స్ (unique Keyboard - Fancy Fonts & Free Emoticons)
-టాన్ గ్రామ్ యాప్ లాక్ (Tangram App Lock)
 -డైరెక్ట్ మెసెంజర్ (Direct Messenger)
-ప్రైవేట్ ఎస్ఎంఎస్ (Private SMS)
-వన్ సెంటన్స్ ట్రాన్సలేటర్- మల్టీ ఫంక్షనల్ ట్రాన్స్ లేటర్ (one Sentence Translator - Multifunctional Translator)
 -స్టైల్ ఫొటో కొలీగ్ (Style Photo Collage)
-మెటిక్యులస్ స్కానర్ (Meticulous Scanner)
-డిజైర్ ట్రాన్సలేట్ (Desire Translate)
-టాలెంట్ ఫొటో ఎడిటర్- బ్లర్ ఫోకస్ (Talent Photo Editor - Blur focus)
-కేర్ మెసేజ్ (Care Message)
-పార్ట్ మెసేజ్ (Part Message)
-పేపర్ డాక్ స్కానర్ (Paper Doc Scanner)
-బ్లూ స్కానర్ (Blue scanner)
-హమ్మింగ్ బర్డ్ పీడీఎఫ్ కన్వర్టర్- ఫొటో టు పీడీఎఫ్(Hummingbird PDF Converter - Photo to PDF)


Previous
Next Post »
0 Komentar

Google Tags