A Great Philanthropist - He donated Rs
58,000 crore - He kept his word
మాట నిలబెట్టుకున్నాడు - రూ.58వేల
కోట్ల యావదాస్తిని దానం చేశాడు!
ఎవరికైనా ఓ పది రూపాయిలు దానం
చేయడానికి ముందూ వెనుకా ఆలోచిస్తారు.. కానీ, ఆయన మాత్రం వేలాది కోట్ల
రూపాయాలను స్వచ్చంధ సంస్థలకు దారాదత్తం చేసి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.
డ్యూటీ ఫ్రీ షాపర్స్
సహ-వ్యవస్థాపకుడు ఛార్లెస్ ‘చక్’ ఫీనీ (89) తన యావదాస్తినీ దానం
చేశారు. ఎనిమిదేళ్ల కిందట ప్రకటించినట్టే మొత్తం ఆస్తిని దానం చేసిన మాట
నిలబెట్టుకున్నారు. కోట్లకు పడగెత్తినా సంపదలో ఆనందం ఉండదని, దాతృత్వంలో ఉంటుందని వెదుక్కున్నారు. ఒకటి రెండు కాదు రూ.58వేల కోట్లకు అధిపతి అయిన చక్.. తన స్వచ్ఛంద సంస్థ ‘అట్లాంటిక్
ఫిలాంత్రోపీస్’ ద్వారా యావదాస్తిని దానం చేశారు. పదవీ విరమణ తర్వాత భార్యతో కలిసి
జీవించేందుకు కేవలం రూ.14కోట్ల ఉంచుకుని, మిగతాది వివిధ స్వచ్ఛంద సంస్థలకు దానమిచ్చేశారు. సెప్టెంబరు నెలతో ఆయన కల
పూర్తికావడంతో ఈనెల 14న ఫీనీ స్వచ్ఛంద సంస్థ ప్రయాణం ముగిసింది.
‘చాలా నేర్చుకున్నా. చాలా
సంతోషంగా ఉంది. నేను బతికుండగానే ఈ మంచి పని పూర్తి కావడం నాకు ఎంతో సంతృప్తిగా
ఉంది.. ఈ ప్రయాణంలో తనకు సహకరించి అందరికీ కృతజ్ఞతలు.. బతికుండగానే దానం చేయడం
గురించి ఆశ్చర్యపోతున్నవారికి దీన్ని ప్రయత్నించండి, మీకు
నచ్చుతుంది’’ అని ఛార్లెస్ ఫోర్బ్స్ పత్రికతో వ్యాఖ్యానించారు.
బిల్ గేట్స్, వారెన్
బఫెట్ తమ దాతృత్వాన్ని చాటుకోవడం వెనుక ఫీనియే స్ఫూర్తిదాత. ‘మా అపార సంపదలను
దానం చేయడానికి చక్ మాకు ఓ మార్గం చూపారు. సగం అస్తులు కాదు, యావదాస్తిని దానం చేయాలంటూ తను నాతో పాటు ఎంతోమందిలో స్ఫూర్తిని
కలిగించారు’ అని బిల్ గేట్స్ పేర్కొన్నారు. దానంలో జేమ్స్‌బాండ్‌గా చార్ల్స్ చక్‌ను
అందరూ పిలుస్తారు. తొలిసారిగా 1984లో స్వచ్ఛంద సంస్థను
ఏర్పాటుచేసి ఉత్తర ఐర్లాండ్‌లో శాంతి, అలాగే వియత్నాంలో ఆరోగ్య
సంరక్షణకు కృషిచేశారు.
ఒకప్పుడు రూ.58వేల
కోట్ల ఆస్తిపరుడు ప్రస్తుతం శాన్‌ఫ్రాన్సిస్కోలో ఓ సాధారణ అపార్ట్‌మెంట్‌లో
భార్యతో కలిసి విశ్రాంత జీవితాన్ని ఓ మధ్యతరగతి మనిషిలా గడుపుతుండటం విశేషం.
ఛార్లెస్ చక్ 1960లో రాబర్ట్ మిల్లర్‌తో కలిసి డ్యూటీ ఫ్రీ
షాపర్స్‌ను ఏర్పాటుచేశారు. తన ఆస్తిలో 3.7 బిలియన్లు విద్యకు,
870 మిలిన్లు మానవ హక్కులు, సామాజిక మార్పునకు,
అట్టడుగు వర్గాల అభ్యున్నతికి 76 మిలియన్లు,
వియత్నాంలో ప్రజారోగ్య సంరక్షణకు 270 మిలియన్
డాలర్లు, మరో 700 మిలియన్ డాలర్ల
ఆరోగ్య సంరక్షణకు అందజేశారు.
చివరిగా న్యూయార్క్ నగరం రూజ్‌వెల్ట్
ద్వీపంలో టెక్నాలజీ క్యాంపస్‌ను నిర్మాణం కోసం 350 మిలియన్ డాలర్లు
విరాళంగా ఇచ్చారు. ‘విలువైన కారణాలకు మద్దతు తెలపడం ద్వారా చాలా మంచిని
సాధించగలిగినప్పుడు ఇవ్వడంలో ఆలస్యానికి నేను చాలా తక్కువ కారణాలను వెదుకుతాను.
అలా కాకుండా, మీరు చనిపోయినప్పుడు ఇవ్వడం కంటే మీరు
బతికున్నటప్పుడు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంటుంది’అని గతేడాది ఈ దానకర్ణుడు
వ్యాఖ్యానించారు.
0 Komentar