Hyderabad most livable city In India,
says survey
హైదరాబాద్ నగరం మరోసారి అరుదైన ఘనత
సొంతం చేసుకుంది. ఇప్పటికే అనేక జాతీయ సర్వేలు, గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో
బెస్ట్ సిటీగా నిలిచిన భాగ్యనగరం.. మరోసారి దేశంలోనే బెస్ట్ సిటీగా నిలిచింది.
భారత్‌లో నివాస యోగ్యమైన, పనికి అనువైన 34 అత్యుత్తమ నగరాల్లో హైదరాబాత్ తొలి స్థానంలో నిలిచిందని హాలిడిఫై.కామ్
అనే వెబ్‌సైట్ సర్వేలో వెల్లడైంది.
పర్యాటకులకు సరైన గమ్యాలను ఎంచుకోవడంలో..
తమ ఇష్టాలకు అనుగుణంగా, ఎలాంటి ఇబ్బందుల్లేకుండా హాలీడేస్ ప్లాన్
చేసుకోవడంలో ఈ వెబ్‌సైట్ ఉపయోగపడుతుంది. భాగ్యనగరం బిన్న రాష్ట్రాల సంస్కృతుల
కలబోత అని ఈ వెబ్‌సైట్ ప్రశంసించింది.
ముంబై, పుణే,
బెంగళూరు, చెన్నై తదితర నగరాలను అధిగమించి
హైదరాబాద్ తొలి స్థానంలో నిలవడం విశేషం. ఈ సర్వే ప్రకారం హైదరాబాద్ నగరంలో
పర్యటించడానికి సెప్టెంబర్-మార్చి మధ్య కాలం అత్యంత అనువైంది. నగరంలోని ఎన్నో
సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయని ఈ సర్వే పేర్కొంది. దక్షిణ భారత న్యూయార్క్ నగరంగా
హైదరాబాద్ మారుతోందని ఈ వెబ్‌సైట్ ప్రశంసించింది.
0 Komentar